బాలీవుడ్ ఇండస్ట్రీలో వివక్ష ఉంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఏ విధమైనటువంటి వివక్షత లేకుండా కేవలం కథను బట్టి సినిమాలను తెరకెక్కిస్తున్నారు.ఆ కథకు అనుగుణంగా నటీనటులను ఎంపిక చేసుకుంటూ ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే.

 Bollywood Actor Nawazuddin Siddiqui Shocking Comments On Racism Details,  Bollyw-TeluguStop.com

కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఎంతో వివక్షత ఉందని నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం కంటే ఎక్కువగా జాత్యాహంకార సమస్య ఉందని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం తెల్లగా ఉన్న వారికి మాత్రమే కాకుండా నల్లగా ఉన్న వారికి కూడా అవకాశాలు ఇవ్వాలని సమాజానికి మేలు చేసే మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలంటే సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి పక్షపాతం ఉండకూడదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Telugu Bollywood, Nepotism, Racism Problem-Movie

ఈ క్రమంలోనే తను చాలా సంవత్సరాల నుంచి అందం, జాత్యాహంకార వివక్షతకు పోరాడుతూనే ఉన్నానని ఎందుకంటే అతను చాలా పొట్టిగా ఉండటం వల్ల అందరిని సమానంగా దృష్టితో చూసి, అందరికీ అవకాశాలు ఇచ్చినప్పుడే ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరపైకి వస్తాయని ఈ సందర్భంగా తెలియజేసారు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం నటీ నటుల పట్ల వివక్ష చూపుతూ కేవలం అందంగా తెల్లగా ఉన్న వారికి మాత్రమే అవకాశాలు ఇస్తారని తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube