కొత్త దర్శకుడుకి అవకాశం ఇచ్చిన హీరో విశాల్... సినిమా ఎనౌన్స్

కోలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విశాల్.తెలుగువాడైన కోలీవుడ్ లో సక్సెస్ అయిన విశాల్ ఈ మధ్యకాలంలో వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు.

 Not A Common Man Vishal 31 Announcement Rises Curiosity, Tollywood, Kollywood, S-TeluguStop.com

రెగ్యులర్ కమర్షియల్ కథలకి దూరంగా, ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే కథలని ఎంపిక చేసుకుంటూ, ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో హీరోగా తనని తాను గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు.సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారానే విశాల్ సినిమాలు ఎక్కువగా తెరకెక్కిస్తున్నాడు.

కెరియర్ ఆరంభంలో సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న ఇప్పుడు మాత్రం వరుస హిట్స్ తో తన హవా కొనసాగిస్తున్నాడు.ప్రస్తుతం విశాల్ హీరోగా, ఆర్య విలన్ గా ఎనిమీ అనే సినిమా చేస్తున్నాడు.

దీంతో పాటు అభిమాన్యుడు, డిటెక్టివ్ సినిమాలకి సీక్వెల్స్ కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ కి విశాల్ ఒకే చెప్పడంతో పాటు దానిని కూడా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపైనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాకి సంబందించిన కాన్సెప్ట్ మోషన్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విశాల్ 31 ఫిలింగా అఫీషియల్ ఎనౌన్స్ చేశారు.ఈ టీజర్ లో ఎక్కువ జనాన్ని చూపించి వారి నుంచి విశాల్ ని ఎలివేట్ చేసి నాట్ ఏ కామన్ మెన్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాతో శరవణన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.మోషన్ టీజర్ బట్టి ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ మూవీగానే ఉండబోతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా స్వరాలు అందిస్తున్నారు.హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంటుంది.త్వరలో ఈ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేయానున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube