శివాలయం విశేషతను ట్విట్టర్‌లో షేర్ చేసిన నార్వే... అత్యంత ఎత్తైనది ఇదేనట!

ఈ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శివాలయం ఏది అనగానే అందరికీ గుర్తొచ్చేది హిమాలయ పర్వతం మీద కొలువై వున్న తుంగనాధ ఆలయం.అవును, హిమాలయం మహిమాన్విత ఆలయాలు ఎన్నిటికో నిలయం.

 Norway Shared The Speciality Of Shiva Temple On Twitter This Is The Highest , Sh-TeluguStop.com

ఎత్తైన పర్వతపానువుల మధ్య, ప్రకృతి ఒడిలో పరమాత్మను దర్శించుకునే భాగ్యం ఇక్కడే లభిస్తుంది.హిమాలయాలలోని తుంగనాథ పర్వతశ్రేణులలో భాగంగా చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది.

ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా హిమాలయాలే దర్శనమిస్తాయి.ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి చంద్రుడు సైతం పరవశించిపోయాడని ప్రతీతి.

ఆ పరవశంలో సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడట.

అందుకనే ఈ పర్వతానికి చంద్రశిల అన్న పేరు వచ్చిందని నానుడి.

రావణ సంహారం అనంతరం రాముడు సైతం ఇక్కడే తపస్సుని ఆచరించాడన్న గాథ కూడా ప్రచారంలో వుంది.ఈ తుంగనాథ్‌ క్షేత్రం ‘పంచ కేదార’ ఆలయాలలో ఒకటి.

ఈ పంచ కేదారాల వెనక కూడా ఓ గాథ ఉంది.కురుక్షేత్ర సంగ్రామం తరువాత పాండవులంతా శివుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నారట.

కురుసంగ్రామంలో తెలిసోతెలియకో అనేకమందిని చంపిన పాపం వారికి అంటుకుంది కదా! ఆ పాపఫలాన్ని నివారించమని ఆ పరమేశ్వరుని వేడుకోవాలనుకున్నారట.

ఉత్తరాఖండ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలోని తుంగ్‌నాథ్‌ మందిర్‌ కలదు.కాగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలోని శివాలయంగా గుర్తింపు పొందింది.సముద్ర మట్టానికి 3680 మీటర్ల ఎత్తులో, 1000 ఏళ్ల కిందట నిర్మించినట్లు పూర్వీకులు చెబుతారు.

కాగా ఈ చిత్రాన్ని నార్వే దౌత్యవేత్త ఎరిక్‌ సోల్హిమ్‌ ట్విటర్‌లో పంచుకున్నారు.ఆలయం 5000 ఏళ్ల నాటిదని చెప్పుకొచ్చారు.అద్భుత దృశ్యం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.తుంగం అంటే పర్వతం అని అర్థం.

హిమాలయాలలోని సమున్నత పర్వతశ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడి శివుని తుంగనాథుడు అన్న పేరుతో పిలుచుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube