వైరల్: తేరే లియే పాటకు నాటు డ్యాన్స్ చేసిన నార్వే టీం!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వివిధ ప్రాంతాలలో వున్న ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కళలు అనేవి ఇతర ప్రాంతాల వారికి కూడా పరిచయం అవుతున్నాయి.ఈ మధ్య కాలంలో చూసుకుంటే ముఖ్యంగా భారతీయ సంగీతం ఇతర దేశస్తులకు కూడా బాగా నచ్చుతున్నట్టుగా కనబడుతోంది.

 Norway Dance Team Super Performance To Tere Liye Song Video Viral Details,  Vira-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇక్కడి పాటలకు ఇతర దేశస్తులు డాన్సులు వేయడం మనం గమనించవచ్చు.

తాజాగా మన తెలుగు పాట ‘నాటు నాటు’ ( Naatu Naatu Song ) ఆస్కార్ బరిలో దుమ్ములేపిన సంగతి విదితమే.

ఈ పాటకైతే ఆదేశం, ఈదేశం అని కాకుండా యావత్ ప్రపంచమే నాట్యం చేసిన పరిస్థితి.ఇక అప్పుడప్పుడు మన బాలీవుడ్ పాటలకు కూడా ఫారిన్ దేశస్తులు కాళ్ళు కదుపుతూ వుంటారు.

ఈ క్రమంలోనే నార్వే డ్యాన్స్ టీం( Norway Dance Team ) క్విక్ స్టైల్ భార‌త్ టూర్‌లో సంద‌డి చేసిన కారణంగా కాలా చ‌ష్మా సాంగ్ కి తమదైన రీతిలో డాన్సులు ఇరగదీసారు.

కాగా సదరు వీడియో వైర‌ల్ అవుతుంది.తొలిసారిగా భార‌త్‌ను సంద‌ర్శించిన నార్వే డ్యాన్స్ టీం ఇప్ప‌టికే విరాట్ కోహ్లీ, సునీల్ శెట్టి, ర‌వీనా టాండ‌న్‌లతో డ్యాన్స్ మూమెంట్స్‌తో హల్ చల్ చేసిన సంగతి విదితమే.కాగా తాజాగా ముంబై మాల్‌లో శ్రేయ ఘోష‌ల్‌, అతిఫ్ అస్లాం ఆల‌పించిన తేరే లియా సాంగ్‌కు( Tereliye Song ) క్రేజీ స్టెప్స్‌తో ఉర్రూత‌లూగించారు.

ఈ వైర‌ల్ క్లిప్‌ను క్విక్ స్టైల్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా తెగ సందడి చేస్తోంది.ఈ వీడియోలో నార్వే డ్యాన్స్ బృంద స‌భ్యులంతా సూట్స్‌లో క‌నిపిస్తూ డ్యాన్స్ ఇరగదీసారు.దాంతో అక్క‌డ జ‌నాలు చ‌ప్ప‌ట్ల‌తో హోరెత్తించారు.ముంబైలోని ఫీనిక్స్ మార్కెట్ సిటీలో వీరి డ్యాన్స్ పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిలిచింది.త‌మ‌ను క‌లిసి త‌మ పెర్ఫామెన్స్ చూసేందుకు వేలాదిమంది త‌ర‌లివ‌స్తార‌ని తామెన్న‌డూ ఊహించ‌లేద‌ని ఈ సందర్భంగా పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube