కిమ్ మామ ‘ఆణిముత్యాలా’ మజాకా..!

ప్రపంచానికి ఇప్పటికీ అంతుచిక్కని వింత ప్రశ్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.ఈ నియంత.

 North Korean Hackers Stole 1.7 Billion Dollars From Cryptocurrency Exchanges,nor-TeluguStop.com

దక్షిణ కొరియానే కాకుండా, చుట్టూ ఉండే జపాన్ లాంటి దేశాలకు సైతం సవాల్ విసురుతూ ఉన్నారు.ఇక ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికాకు సైతం ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్నారు.

కరోనా టైంలో కూడా అణు పరీక్షలు జరిపి ప్రపంచ వినాశనానికి దారులు వేశారు.కరోనా వ్యాక్సిన్లు ఉచితంగా ఇస్తామని ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ముందుకు వచ్చినా.

ఒక్క చేత్తో వద్దన్నాడు.అయితే కిమ్ ను కంట్రోల్ చేయడానికి అమెరికా పెద్ద మొత్తంలో ఆంక్షలు విధించింది.

అయినా కిమ్ మాత్రం కించిత్తు కూడా జంగలేదు.

Telugu America, Block Chain, China, Cryptocurrency, Hackers, Kim Jong, Korea-Pol

అమెరికా లాంటి దేశాలకు షాక్ ఇస్తూ.ఒక ఆణిముత్యాల టీమ్ ను తయారు చూసుకున్నారు.డాలర్లను దేశంలోకి రాకుండా అమెరికా ఆంక్షలు విధించడంతో.

సైబర్ మోసాలు, హ్యాకింగ్ లాంటి ట్యాలెంటెడ్ టీమును తయారు చేసుకున్నాడు.తన జాతి రత్నాల సాయంతో ఏకంగా క్రిప్టో కరెన్సీకే సవాల్ విసిరి 1.7 బిలియన్ డాలర్లను కాజేశాడు.బ్లాక్ చైన్ అనే టెక్నాలజీతో పకడ్బంధీగా నడిచే ఎక్స్ చేంజ్ ను హ్యాకర్లతో కొల్లగొట్టించాడు.

ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా క్రిప్టో కరెన్సీ జాగ్రత్త పడింది.అయితే డిజిటల్ కరెన్సీ లావాదేవీల విశ్లేషణ సంస్థ చైన్.

మాత్రం ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది.

Telugu America, Block Chain, China, Cryptocurrency, Hackers, Kim Jong, Korea-Pol

గతేడాది కూడా దాదాపు 429 మిలియన్‌ డాలర్లు కొల్లగొట్టారని నివేదికలో తేలింది.కానీ దానితో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఇక గతేడాది మొత్తం 3.8 బిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టోలను హ్యాకర్లు దోపిడీ చేయగా.ఇందులో 44శాతం ఉత్తరకొరియా నేరగాళ్లు చేసినవే అని సంస్థ తెలిపింది.

చైనా , నాన్‌-ఫంగిబుల్‌ టోకెన్స్‌ బ్రోకర్ల ద్వారా ఈ హ్యాకర్లు క్రిప్టోలను దొంగిలిస్తున్నట్లు చైన్‌ ఎనాలసిస్‌ వివరించింది.

ఆంక్షల వలయంలో చిక్కుకుపోయిన ఉత్తరకొరియా.తన అణ్వాయుధ ప్రయోగాలకు నిధుల కోసం క్రిప్టో నేరాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.గతేడాది హారిజన్‌ బ్రిడ్జ్‌ అనే బ్లాక్‌చైన్‌ నెట్‌వర్క్‌లో 100 మిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టోలు చోరీకి గురయ్యాయి.

ఇది ఉత్తరకొరియాకు చెందిన లాజరస్‌ గ్రూప్‌ పనే అని గత నెల అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube