సరికొత్త బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగిస్తున్న ఉత్తరకొరియా...?!

ఉత్తరకొరియా ఇప్పుడు మంచి దూకుడు మీద ఉందని చెప్పాలి.ఎందుకంటే మిస్సైల్స్ ను ప్రయోగించడంలో ఉత్తర కొరియా ఏమాత్రం వెనుక అడుగు వేయడం లేదు.

 North Korea Tested Its Rail Lauched Ballistic Missiles-TeluguStop.com

కిమ్ దేశం ప్రయోగిస్తున్న ఈ క్షిపణులను చూసి ప్రపంచ దేశాలు గడగడ లాడిపోతున్నాయి.ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని భయంతో ఉన్నారు.

ఎందుకంటే అణ్వాయిదాలను ప్రయోగించే దిశగా ఉత్తరకొరియా చర్యలు చేపడుతున్న కారణం చేత ప్రపంచ దేశాలు ఒకింత ఉత్తర కొరియా దేశం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నాయి.ఇంతవరకు ఏ దేశం కూడా ఇలాంటి మిస్సైల్ ప్రయోగాలను ప్రయోగించలేదు.

 North Korea Tested Its Rail Lauched Ballistic Missiles-సరికొత్త బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగిస్తున్న ఉత్తరకొరియా…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ నియంత దేశం అయిన నార్త్ కొరియా మాత్రం నా రూటే సెపరేటు అన్నట్టు వ్యవహరిస్తోంది.తాజాగా ఉత్తర కొరియా రైల్వే ఆధారిత వ్యవస్థను వినియోగించుకుని రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు స్వయంగా ఆదేశమే ప్రకటించింది.

ఈ వ్యవస్థను ఉపయోగించుకుని ఉత్తర కొరియన్లు శత్రువులపై దాడిచేసే ప్రయత్నంలో ఉన్నారని ఒక నివేదికలో తెలిసింది.

అంతేకాదు ఈ రైల్వే ఆధారిత మిసైల్ ప్రయోగాలకు ఖర్చు కూడా తక్కువ అవ్వడంతో ఉత్తర కొరియ ఈ ప్రయోగాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

ఉత్తర కొరియా మిలిటరీ రైల్వే మొబైల్ క్షిపణి రెజిమెంట్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలను నిర్వహించినట్లు తెలుస్తుంది.ఈ మిస్సైళ్లు ప్రయోగ కేంద్రం నుంచి సుమారు 800కిలోమీటర్ల మేర వరకు ప్రయాణించినట్టు స్థానిక మీడియా ఒక కథనంలో వెల్లడించింది.

అలాగే ఒకసారి ఈ ప్రయోగం గురించి తెలుసుకుంటే ఇందులో లాంచర్ సవరించిన బాక్స్‌ కార్ లోపల ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది.అలాగే క్షిపణికి కలిపిన లాంచర్ ఆర్మ్, పైకప్పు ఓపెన్ అయిన తర్వాత అది ప్రయోగ స్థానంలోకి నెమ్మదిగా వెళ్తుంది.

Telugu Ballistic Missiles, Kim Jong-un, News Viral, North Korea, North Korea Missile Testing, Rail Borne Missiles, Rail Lauched Ballistic Missiles, Social Media, Tested Missiles, Trains, Viral Latest-Latest News - Telugu

ఆ తరువాత క్షిపణి రాకెట్ మోటార్ల నుంచి పైకి పేలినప్పుడు అది బయటకు వెళ్లేందుకు వీలుగా రెండు వైపులా ఆటోమేటిక్ గా తలుపులు తెరుచుకుంటాయి.మొత్తం ఈ ప్రయోగానికి సంబందించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసారు.ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.ఇదిలా ఉండగా ఉత్తర కొరియా గతంలోనే KN-23 క్షిపణిని కూడా పరీక్షించగా అది కేవలం 261 మైళ్ల నుంచి 280 మైళ్ల వరకు మాత్రమే ఎగిరినది.

కానీ ఇప్పుడు ఈ మిస్సైల్ మాత్రం 373 మైళ్ల దూరం ప్రయాణించిందని ఒక నివేదిక పేర్కొంది.అంటే KN-23 క్షిపణి కన్నా ఈ రైల్వే మొబైల్ క్షిపణుల పరిధి గణనీయంగా ఉంది అని చెప్పవచ్చు.

రానున్న రోజుల్లో ఉత్తర కొరియా ఈ రైల్వే మొబైల్ క్షిపణిని ఉపయోగించి ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందో వేచి చూడాలి మరి.

#Trains #RailLauched #North Korea #Missiles #Kim Jong

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు