ప్రపంచ యుద్దం దిశగా..ఉత్తర కొరియా   North Korea Ready To Shoot US Warplanes     2017-09-26   22:48:45  IST  Raghu V

ఒక వ్యక్తి పంతం..స్వార్ధం..పగ. ఇలా ఇవన్నీ ఆ వ్యక్తికీ ..లేదా ఆ కుటుంబానికి హాని చేసూరుస్తాయి.కానీ దేశాధ్యక్షుల పగలు కొన్ని కోట్లమంది అమాయకపు ప్రజల ప్రాణాల్ని బలిగొంటాయి.ఇలాంటివి హిట్లర్ వింటూనే వచ్చాము.కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది.

మరికసారి కోట్లాది మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉందా అనే సందేహాలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. కోట్లాదిమంది ప్రాణాలు తీయటానికి ఒక నియంత కంకణం కట్టుకున్నాడా? ఎవరి మొండి తనంతో వారు ప్రపంచం మొత్తాన్ని యుద్ధంలోకి లాగేలా చేస్తుస్తున్నారు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

కిమ్ లాంటి నరరూప రాక్షసుడిని ఎవరి స్వార్ధనికి తగ్గట్టుగా వాళ్ళు తయారుచేసుకున్నారు. వారి వారి వ్యాపారాల అభివృధ్ధికోసం కిమ్ చేతిలో అణ్వాయుధాలు పెట్టారు.పిచ్చోడి చేతిలో రాయిలా అది ఎప్పుడు పేలుస్తాడో అని కోట్లాదిమంది భయపడిపోతున్నారు.

అమెరికా.. ఉత్తరకొరియాల మధ్య నడిచిన మాటల యుద్ధం అంతకంతకూ పెరిగింది. ఎవరికి వారు యుద్ధ సన్నాహాల్లో బిజీగా ఉండటం.. ట్రయిల్స్ వేసుకోవటం చూస్తుంటే మిగిలిన ప్రపంచప్రజలకు వెన్నులో వణుకు మొదలయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్తర కొరియా పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైపోతోంది. ఇందులో భాగంగా కొరియా ద్వీపకల్పం దగ్గర్లో ఎగిరే అమెరికా బాంబర్లను నేల కూలుస్తామని ఉత్తరకొరియా హెచ్చరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశంపై యుద్ధం ప్రకటించారని.. తమ దేశానికి ఆత్మరక్షణ చర్యలకు దిగే హక్కు ఉందని కిమ్ చెబుతున్నాడు.

మరోవైపు ఉత్తర కొరియా తూర్పు తీరంలో యుద్ధ సన్నాహాలు చేస్తోంది. రక్షణ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. అమెరికా.. ఉత్తర కొరియాల మధ్య కానీ యుద్ధం మొదలైతే ఇది ఆ రెండు దేశాల మధ్య జరిగేది కాదు మిగిలిన దేశాలని కూడా యుద్ధంలో భాగస్వాములను చేస్తాయి.

,