ఇదేందయ్యా ఇది : ఆ దేశంలో నీలి చిత్రాలు చూస్తే కఠిన శిక్ష విధిస్తారంట...

ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రాజులు కాలం అంతరించిపోయినప్పటికీ ఇప్పటికీ రాజ కుటుంబాల నియంత పాలనలో మగ్గిపోతున్న దేశాలలో ఉత్తర కొరియా ఒకటి.అయితే ఈ దేశ కట్టు బాట్లు, ఆచారాలు మరియు సంప్రదాయాలు దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలకు లోబడి ఉంటాయి.

 North Korea Punishes People Who Watches Sexual Video,kim Jong Un, North Korea, W-TeluguStop.com

అయితే ఈ కట్టుబాట్ల పేరుతో కిమ్ జాంగ్ ఉన్ పాలన ఎంత అరాచకంగా ఉందో ఇప్పటికే ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి.

అయితే ఈ దేశంలో ప్రజలకు సమాచారాన్ని అందించే వార్త ఛానళ్లలో కేవలం మూడు మాత్రమే ఉంటాయి.

 అవి కూడా ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తుంటాయి.అంతేకాక ఈ దేశంలో సెల్ ఫోన్ వాడకం కూడా దాదాపుగా తక్కువగా ఉంటుంది.

అయితేగాక కిమ్ దేశంలో నీలి చిత్రాలు చూసేటువంటి యువతీ యువకులు కఠినంగా శిక్షించాలని అంటూ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇటీవలే కరోనా వైరస్ కారణంగా పౌల్ట్రీ ఫారం ఉత్పత్తులు పడిపోవడంతో మాంసాహారాన్ని ప్రోత్సహించేందుకు గాను దేశంలో ఉన్నటువంటి పెంపుడు కుక్కలను చంపి మాంసాన్ని విక్రయించాలని అంటూ ఇదివరకే ఆదేశాలు జారీ చేశాడు.

అంతేకాక ఉత్తర కొరియాలో చైనా దేశస్తులు ఎక్కడ కనిపించినా కాల్చేయండి అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ ఎంత క్రూరంగా పరిపాలన సాగిస్తున్నాడని…

గత  కొన్నేళ్లుగా కిమ్ జాంగ్ ఉన్ పరిపాలనతో విసిగిపోయిన  ప్రజలు అతడి పరిపాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు.

కానీ ఉత్తర కొరియాలో కిమ్ ని ఎదిరించి ఎన్నికలలో పోటీ చేసేందుకు బలమైన ప్రత్యర్థులు లేక దాదాపుగా 60 సంవత్సరాల నుంచి వంశస్తుల ఉత్తర కొరియాని పాలిస్తున్నారు.అయితే ఆమధ్య కాలంలో కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యకారణంగా చనిపోతున్నట్లు పలు వార్తలు బలంగా వినిపించాయి.

కాగా కిమ్ మరణాంతరం కూడా కూడా అతడి సోదరి పాలన పగ్గాలు చేపడుతుందట…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube