ఇది ఇండియా : కరోనాకు కూడా పాట కట్టేశారు, పాట పాడి పంపిస్తారట  

North Indian Family Sing A About Corona Virus - Telugu Corona Virus , Dandiya , North Indian Family

ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో అన్ని విభిన్నంగానే ఉంటాయి.ఇక్కడ పద్దతులు, కట్టుబాట్లు అన్ని కూడా విచిత్రంగా అనిపిస్తాయి.

 North Indian Family Sing A Song About Corona Virus

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనాకు భయపడుతుంటే ఇండియన్స్‌ మాత్రం కరోనాకు భయపడుతూనే దాన్ని విభిన్నంగా ప్రచారం చేస్తూ ఉన్నారు.ఉత్తర భారతదేశంలోని ఒక ఫ్యామిలీ కరోనా వైరస్‌ గురించి పాట పాడటంతో పాటు తమ వద్దకు రావద్దంటూ కరోనాకు విజ్ఞప్తి చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఇండియాలో ఇలాంటివి జరుగుతుంటాయంటూ సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది.

ఇది ఇండియా : కరోనాకు కూడా పాట కట్టేశారు, పాట పాడి పంపిస్తారట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

వంద దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ను గురించి పాట అంటూ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక నార్‌ ఇండియన్‌ కుటుంబ సభ్యులు అంతా ఆడవారే ఒక దేవి పూజ నిర్వహించినట్లుగా పూజలు నిర్వహించి పాటలు పాడారు.

దేవుడికి పూజలు చేసి కరోనా రాకూడదు అంటూ దాండియా రూపంలో పాటను పాడి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఈ పాటను ప్రముఖ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కృష్ణ మోహన్‌ శర్మ పోస్ట్‌ చేశాడు.

ప్రపంచ వ్యాప్తంగా వేలాది మందిని బలి గొంటున్న కరోనా వైరస్‌ గురించి పాట పాడటం అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా బాధితులు ఉన్న కారణంగా ప్రస్తుతం ఈ పాటను నెటిజన్స్‌ తెగ చూస్తున్నారు.ఇలాంటి పాటలు కూడా కడతారా అంటూ ఇతర దేశస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు.కరోనా గురించి వారు పాడిన పాట అర్థం కాకున్నా కూడా విదేశీయులు ఈ పాటను తెగ షేర్‌ చేస్తున్నారట.

మొత్తానికి కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం వణికి పోతున్నా ఈ ఆడవారు మాత్రం తాపీగా దాని గురించి పాట పాడడం విడ్డూరం.అందుకే ఇండియాలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయని ప్రపంచ దేశాలు అంటున్నాయి.