నార్త్ కరోలినాలో నాణాల గుట్టలు..చూస్తే కళ్ళు గిర్రున తిరగాల్సిందే..!!!

కష్టాలలో ఉన్నప్పుడు దేవుడే కరుణిస్తాడు పడిన కష్టానికి ప్రతిఫలం చూపిస్తాడని పెద్దలు చెప్తూ ఉంటారు.అవును నిజమే కష్టాలలో ఉన్న ప్రతీ ఒక్కరికి ఎదో ఒక దారి చూపిస్తాడు కొందరు ఆ మార్గం గుండా వెళ్తారు.

 100 Gallons Of Coins Found In Nc Fountain, North Carolina, Coins Found In North-TeluguStop.com

మరి కొందరు వేరే మార్గాలని అనుసరిస్తారు.ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే.

అమెరికాలో అదిపెద్ద అక్వేరియం ను నిర్వహిస్తున్న ఓ సంస్థ తన అక్వేరియం గుట్టలు గుట్టలుగా పడి ఉన్న నాణాలు చూసి షాక్ అయ్యింది వెంటనే వాటిని తీసి లేక్కపెట్టాలని డిసైడ్ అయ్యింది.ఇంతకీ ఆ నాణాలు ఎలా వచ్చాయి.

ఆ మొత్తం ఎంత అనే వివరాలలోకి వెళ్తే.

నార్త్ కరోలినాలో ఉండే అక్వేరియం చుట్టుపక్క ఎంతో ఫేమస్ అక్కడికి ఎంతో మంది వస్తుంటారు.

వచ్చే నిర్వాహకులతో కిటకిటలాడుతూ ఎంతో లాబదాయకంగా ఉంటోంది అక్వేరియం.ఈ అక్వేరియం లో ఉన్న స్మోకీ పర్వతం నుంచీ కిందకి నీళ్ళు వస్తూ ఉంటాయి.30 అడుగులు లోతు ఉండే ఆ వాటర్ ఫాల్స్ లో నాణాలు వేస్తె ఎలాంటి కోరిక అయినా తీరుతుందని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు.దాంతో అక్కడికి వచ్చే వేలాదిమంది ప్రజలు నాణాలు వేస్తూ ఉంటారు.

కరోనా కారణంగా సందర్శకులు లేకపోవడంతో అక్వేరియం కి డబ్బుల కొరత వచ్చింది.అయితే ప్రజలు నాణాలు వేస్తూ ఉంటారు కదా వాటిని ఇక్కడి జంతువుల ఆహారం కోసం ఉపయోగించాలని అనుకున్నారు నిర్వాహకులు.దాంతో

సందర్శకులు వేసే నాణాలని బయటకి తీయడానికి సిద్దమయ్యారు.వాటర్ ఫాల్స్ ఫౌంటెన్ లోకి దిగి చూస్తే గుట్టలు గుట్టలుగా నాణాలు కనిపించాయి.అక్వేరియం నిర్వాహకులకి కళ్ళు చెదిరిపోయాయి.వారు ఊహించిన దానికంటే ఎక్కువ నాణాలు లభించాయని నిర్వాహకులు తెలిపారు.

అంతేకాదు వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ మొత్తం నాణాల విలువ చెప్పండి అంటూ ప్రశ్నించారు.

త్వరలో అన్నిటిని లెక్క బెట్టిన తరువాత వాటి విలువ వెల్లడిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube