North-American Punjabi Association : ఎన్ఆర్ఐ కోర్టుల సంఖ్యను పెంచండి .. భగవంత్ మాన్ సర్కార్‌కి ప్రవాసీ పంజాబ్ సంఘం విజ్ఞప్తి

ప్రవాసులకు సకాలంలో న్యాయం జరిగేలా పంజాబ్‌లో ఎన్ఆర్ఐ కోర్టుల సంఖ్యను పెంచాలని నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ విజ్ఞప్తి చేశారు.సమస్యల పరిష్కారానికి గాను పంజాబ్ ప్రభుత్వం జలంధర్, మొహాలీ, లూథియానా, మోగా , అమృత్‌సర్‌లలో ఎన్ఆర్ఐ సమావేశాలు జరపడం పట్ల పంజాబీ ప్రవాసులు సంతోషంగా వున్నారని సత్నామ్ సింగ్ అన్నారు.

 North-american Punjabi Association Urges To Bhagwant Mann Govt For Increasing Nr-TeluguStop.com

పంజాబీ ప్రవాసుల సమస్యలు , ఆందోళనలను వారి ఇంటి వద్దే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం రాష్ట్రంలో ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు.పంజాబీ ప్రవాసులకు గ్యాంగ్‌వార్ ఆందోళన కలిగిస్తోందని.

అభద్రతా భావంతో వున్న ఎన్ఆర్ఐలకు ఆయుధాల లైసెన్స్‌లు మంజూరు చేయాలని సత్నామ్ సింగ్ కోరారు.ఎట్టి పరిస్ధితుల్లోనూ న్యాయం జరగడం ఆలస్యం కాకూడదన్న ఆయన.సమయానుకూలంగా సమస్యలను పరిష్కరించేందుకు గాను ఎన్ఆర్ఐ కోర్టుల సంఖ్యను పెంచాలని చాహల్ అన్నారు.

ఇకపోతే… పంజాబ్‌లో ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుతమున్న కోర్టుల సంఖ్యను పెంచాలని భగవంత్ మాన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క జలంధర్‌లో మాత్రమే ఎన్ఆర్ఐ కోర్టు వుంది.తాజా ప్రతిపాదన ప్రకారం.మరో ఐదు ఎన్ఆర్ఐ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.భటిండా, నవాన్‌షహర్, పటియాలా, హోషియార్‌పూర్, మోగాలలో వీటిని నెలకొల్పనున్నారు.

పంజాబ్, హర్యానా హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీతో చర్చించిన అనంతరం ఎన్ఆర్ఐ కోర్టులను త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర హోం శాఖ.న్యాయ శాఖను కోరింది.

Telugu Adcs, Bhagwant Mann, Dccs, Jalandhar, Kuldeepsingh, American, Nri, Nri Fa

రాష్ట్రంలో ఎన్ఆర్ఐలకు సంబంధించి దాదాపు 2,500 కేసులు పెండింగ్‌లో వున్నాయని ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్ తెలిపారు.ఎన్ఆర్ఐలకు సాధ్యమైన విధంగా సాయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.ఎన్ఆర్ఐ కమీషన్ తోడ్పాటుతో ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోందని ఆయన చెప్పారు.కమీషనర్లు, డీసీసీలు, ఏడీసీలు, ఎస్‌డీఎంలతో ఎన్ఆర్ఐ సంబంధిత రెవెన్యూ కేసుల డేటాను తమ శాఖ సేకరిస్తోందని కుల్‌దీప్ సింగ్ చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube