ఐటీ పరిధిలోకి అమెరికా యూట్యూబర్లు...భారతీయులపై ప్రభావం ఎంతంటే...!!

యూట్యుబ్.గడించిన రెండేళ్లలో యూట్యూబ్ కు వస్తున్న ఆదరణ అంతా యింతా కాదు.

 Non - Us Youtube Creators Will Have To Pay Us Taxes , Videos, Short Film, Cooki-TeluguStop.com

గతంలో ఫేస్ బుక్ సోషల్ మీడియా రంగంలో అగ్ర స్థానంలో ఉండగా ఆ తరువాత వాట్సప్ ఆ స్థాయికి చేరుకుంది.అయితే ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఎంటర్టైన్మెంట్ కోసం, ఎలాంటి విషయాలని తెలుసుకోవాలన్నా యూట్యూబ్ పైనే ఆధారపడుతున్నారు.

అంతేకాదు ఈ యూట్యూబ్ లో రకరకాల వీడియోలు, షార్ట్ ఫిల్మ్, వంటా వార్పూ, తమ టాలెంట్ లు అన్నీ ఉపయోగించి కోట్లు గడిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు.ఇలా కేవలం యూట్యూబ్ నే ఆధారంగా చేసుకుని డబ్బులు సంపాదించే వారిలో అమెరికన్స్ అత్యధికంగా ఉన్నారు.

అయితే ఇప్పుడు అమెరికా యూట్యూబర్స్ కు అక్కడి ప్రభుత్వం పిడుగులాంటి వార్త వినిపించింది.వారికి మాత్రమే కాదు అమెరికా బయట ఉన్న యూట్యూబ్ క్రియేటర్స్ కు కుడా ఈ షాక్ తగలనుంది.

అదేంటంటే.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న వారిని అందరిని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకువచ్చింది.

అమెరికా ఐటీ ల ప్రకారం యూట్యూబర్స్ తమ సంపాదనలో 24 శాతం పన్ను చెల్లించాలన్న మాట.అంతేకాదు మరొక విషయం ఏమిటంటే అమెరికాలో కాకుండా బయట నుంచీ వచ్చే కంటెంట్ రచయితలపై కూడా ఈ ప్రభావం పదనుందట.

Telugu America, Writer, Warp, Google, Short, Youtube Program-Telugu NRI

అమెరికా ట్యాక్స్ లా ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ ౩ ప్రకారం.అమెరికాలో ఎవరైతే వీక్షకులు ఉన్నారో వారి సంఖ్య అలాగే ఈ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే కంటెంట్ రైటర్ ల నుంచీ పన్ను సమాచారం సేకరించే భాద్యతలను ప్రభుత్వం గూగుల్ కు అప్పగించిందట.అంటే వారికి వచ్చే ఆదాయంలో ప్రభుత్వం విధించిన పన్ను శాతం కోసేసి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి.ఈ మేరకు గూగుల్ మార్చి నెలలో ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

అదేంటంటే యూట్యూబ్ ప్రోగ్రాం లో ఉన్న కంటెంట్ రైటర్ లు అందరూ ప్రపంచంలో ఎక్కడా ఉంటున్నారు అనే భేదం లేకుండా మే 31 లోగా తమ పన్ను సమాచారం అందించాలట.అయితే భారత దేశంలో ఉన్న కంటెంట్ రైటర్ లపై ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనే విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది.

కానీ నిపుణులు మాత్రం ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube