ఆగని వరి ధాన్యం కొనుగోళ్ల రచ్చ...తగ్గేది లేదంటున్న టీఆర్ఎస్

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య మాటలతూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి పండుతుందన్న విషయం తెలిసిందే.

 Non-stop Rice Grain Buying Frenzy Trs Seems To Have Not Abated Telangana Politic-TeluguStop.com

అయితే ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా అత్యధిక వరి ధాన్యం నిల్వలు ఉన్నాయనే కారణంతో బాయిల్డ్ రైస్ ను కొనేది లేదని తాజాగా కేంద్ర మంత్రి కూడా పార్లమెంట్ లో స్పష్టం చేసిన పరిస్థితి ఉంది.ఇప్పుడు ఈ వ్యాఖ్యలే టీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున ఆగ్రహం తెప్పించిన పరిస్థితి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఇవ్వడం లేదని ఇస్తే కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని కాని కొంటామని చెబుతున్నా టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని తాజాగా కేంద్ర మంత్రి  పీయుష్ గోయల్ తెలిపారు.రా రైస్, బాయిల్డ్ రైస్ కు తేడా తెలియని వాళ్ళు బీజేపీ ఎంపీలు కావడం మన దురదృష్ట కరమని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది.

Telugu @bjp4india, @bjp4telangana, @cm_kcr, Telangana-Political

అయితే తమది కాదంటే తమది కాదు అనే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తుండటంతో తెలంగాణ రైతాంగం పెద్ద ఎత్తున డైలమాలో ఉన్న పరిస్థితి ఉంది.రైతాంగాన్ని వరి వేయవద్దని మరల కోరుతున్నామని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మాటలను లెక్కచేయక ధిక్కరించి వరిని పండిస్తే నష్టాల బారిన పడే అవకాశం ఉందని వచ్చే యాసంగి సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి ఉంది.ఏది ఏమైనా వరి ధాన్యం కొనుగోళ్ళపై రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్న తరుణంలో మరి రానున్న రోజులలో పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube