వైరల్: లేని శిల్పాన్ని వేలం వేసిన కళాకారుడు.. అయినా కానీ..?!

అప్పుడ‌ప్పుడు కొన్ని వార్త‌లు, విశేషాలు మ‌న‌కు నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంటాయి.అందులో జ‌రిగిన విష‌యాలు చూస్తుంటే మ‌న‌కు కూడా అలాంటి ల‌క్ త‌గిలితే బాగుండు అని అనుకుంటాం.

 Non Existent Sculpture-TeluguStop.com

అస‌లు నిజంగా ఇలాంటి విష‌యాలు ఇంత తేలిగ్గా ఎలా జ‌రుగుతాయా అని అంద‌రం ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటాం.ఇక ఇలాంటి విష‌య‌మే ఇప్పుడు సోష‌ల్ ప్ర‌పంచాన్ని ఊపేస్తోంది.

మ‌నం ఏదైనా వ‌స్తువును అమ్మాలంటే దాన్ని చూపిస్తే గానీ సాద్యం కాదు.కానీ ఓ వ్య‌క్తి అస‌లు లేని వ‌స్తువును భారీ రేటుకు అమ్మేసి అంద‌రినీ ఆశ‌ర్చంలో ముంచెత్తాడు.

 Non Existent Sculpture-వైరల్: లేని శిల్పాన్ని వేలం వేసిన కళాకారుడు.. అయినా కానీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆన్ లైన్ వ్యాపారం అయినా.పేవ్ మెంట్ మీద జ‌రిగే అమ్మ‌కాలు అయినా స‌రే అమ్మే విధానంలో మార్పు ఉండ‌దు.

కొనే వారికి ఖ‌చ్చితంగా వ‌స్తువును చూపించాల్సిందే.కానీ, ఇప్పుడు మీకో కళాత్మక వ్యాపారి గురించి చెబుతాం.

ఆయన చేసిన ప‌నికి మీకు నిజంగా ఆశ్చ‌ర్యం వేస్తుంది.

సాల్వటోర్ గారౌ అనే ఇటాలియన్ చెందిన కళాకారుడు చేసిన ప‌ని ఇది.ఈయన ఒక శిల్పాన్ని వేలంలో అమ్మేశారు ఏకంగా 15వేల యూరోల‌కు అమ్మేశాడు.ఇక్క‌డే అస‌లు ట్విస్టు ఏంటంటే అసలు అక్కడ శిల్పం లేదు.

ఈయ‌న త‌న సోష‌ల్ మీడియాలో అదృశ్య శిల్పం కొంటారా.ఈ కళ పేరు లో సోనో అంటూ విప‌రీతంగా ప్రచారం చేశాడు.

ఈ విధంగా లేని ఉన్న‌ట్టు వేలంలో ఉంచిన ఆయన దానికి ప్రారంభ ధర ఆరువేల యూరోలుగా నిర్ణ‌యించాడు.ఇక కొనే వారికి ఏమి కనిపించిందో కానీ, దానికి ఓ తింగ‌రి వ్య‌క్తి ఏకంగా 15 వేల యూరోలు చెల్లించి మ‌రీ కొనుక్కున్నాడు.

విన‌డానికి కాస్త వింతగా అనిపించినా ఇదే నిజ‌మండి బాబు.

Telugu 15 Thousand, Auctioned, Euros, Italy, Non-existent-sculpture, Viral Latest, Viral News-Latest News - Telugu

ఇక ఈ శిల్పానికి కూడా కొన్ని విశేషాలు ఉన్నాయని చెబుతున్నారు.ఉనికిలో లేని శిల్పం వాస్తవానికి కనిపించద‌ని అంద‌రికీ తెలుసు.ఎందుకంటే ఇది చూసేవారి ఊహను సక్రియం చేసే శక్తి క‌లిగి ఉంటుంది.

ప్రతి వ్యక్తికి తనకి ఉన్న సామర్థ్యం ప్రకారం దాన్ని ఊహించుకోవచ్చు అని ఆ శిల్ప కళాకారుడు అయిన సాల్వ‌టోర్ గారౌ చెబుతున్నాడు.హైసెన్‌బర్గ్ అనిశ్చితి సూత్రం ప్రకారం ఈ శిల్పం ఎలాంటి బరువు లేదు … అందువల్ల, ఇది ఘనీభవించిన శక్తిని కలిగి ఉంటుంది కాబ‌ట్టి కణాలుగా, అంటే మనలోకి రూపాంతరం చెందింది ”అని గారౌ అంద‌రికీ వివ‌రిస్తున్నాడు.

అస‌లు విష‌యం ఏంటంటే అక్క‌డ ఎలాంటి శిల్పం లేదు.

#Euros #Auctioned #15 Thousand #Italy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు