లలిత్ మోడికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

అవినీతికి పాల్పడి, అక్రమాలు చేసి ప్రస్తుతం లండన్లో తదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది.ముంబైలోని కోర్టు ఆయనకు వారెంట్ జారీచేసింది.

 Non-bailable Arrest Warrant Issued Against Lalit Modi-TeluguStop.com

లలిత్ మోడిని అరెస్ట్ చేసి తీసుకువస్తే ఇండియాలో ఆయన మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కోవలసి ఉంటుంది.మోడితో విదేశాంగ మంత్రి సుష్మాకు , రాజస్త్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకి సంబంధాలు ఉన్నాయని, కాబట్టి వారు రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం, వారు రాజీనామా చేసేదాకా పార్లమెంట్ సమావేశాలు జరగనివ్వబోమని పంతం పట్టడం తెలిసిందే.

అనుకున్న విధంగానే సభను జరగనివ్వలేదు.లలిత్ మోడితో తమకు సంబంధాలు లేవని సుష్మా, రాజే చెప్పినా కాంగ్రెస్, ఇతర పార్టీలు వినలేదు.

ఫలితంగా సభ జరగడంలేదు.ఈ వివాదాన్ని ముగించాలనే అభిప్రాయంతో ప్రభుత్వం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇప్పించి ఉండ వచ్చని కొందరు చెబుతున్నారు.

బాగా ప్రాచుర్యం పొందిన 20-20 క్రికెట్ పోటీలను లలిత్ మోడీ పరిచయం చేసారు.ఈ పోటీలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

ఈ పోటీల పట్ల యూత్ బాగా మొగ్గు చూపింది.అయితే లలిత్ మోడీ 2010లో ఇండియా నుంచి పారిపోయాడు.

ఆయనపై పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్ మొదలైన ఆరోపణలు ఉన్నాయి.మోడీ ఇండియా రావడానికి ఇష్టపడటంలేదు.

మరి ఇప్పటికైనా తీసుకువస్తారా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube