బ్రేకింగ్ : టి‌ఆర్‌ఎస్ ఎం‌ఎల్‌ఏ నోముల మృతి  

టి‌ఆర్‌ఎస్ ఎం‌ఎల్‌ఏ నోముల నర్సింహయ్య కన్నుమూశారు.ఆయన మరణ వార్త తెలియడంతో నియోజకవర్గంలోనూ, టి‌ఆర్‌ఎస్ పార్టీ లోనూ విషాద ఛాయలు అల్లుకున్నాయి.

TeluguStop.com - Nomula Narasimhaiah Is No More

అనారోగ్య సమస్య తో బాదపడుతున్న నోముల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు.మంగళవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు.

ఆయన మరణం తో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.నోముల 1987 లో నకిరేకల్ నుండి మండల పరిషత్ అధ్యక్షుడి గా ఎన్నికయ్యారు 1999 లో నకిరేకల్ నియోజకవర్గం నుండి మార్కిస్ట్ పార్టీ తరుపున ఎమెల్యే గా గెలిచాడు.2018 అసెంబ్లి ఎలెక్షన్స్ లో తెరాస నుండి నాగార్జున సాగర్ నియోజక వర్గానికి ఎమెల్యే గా గెలిచాడు. 30 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు నోముల నర్సింహయ్య.

TeluguStop.com - బ్రేకింగ్ : టి‌ఆర్‌ఎస్ ఎం‌ఎల్‌ఏ నోముల మృతి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నోముల అంత్యక్రియలు ఆయన సొంత ఊరు అయిన పాలెంలో జరుగుతాయని కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు.ఆయన పార్థివ దేహాన్ని కొత్తపేటలో ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు.అక్కడి నుండి నాగార్జున సాగర్ హాలియా మండలంలో ఆయన నివాసానికి తరలిస్తారు.బుదవారం సాయంత్రానికి ఆయన సొంత ఊరుకి తరలించి ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు పలువురు తెరాస నాయకులు మంత్రులు హాజరు అవ్వనున్నట్లుగా సమాచారం.

#Nagarjuna Sagar #Nakirekal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nomula Narasimhaiah Is No More Related Telugu News,Photos/Pics,Images..