నోకియా అద్భుతం చేయబోతోంది... చంద్రుడిపై నోకియా 4జీ నెట్‌వర్క్‌!

ప్రపంచ ప్రఖ్యాత గాంచిన స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా( Nokia ), సరికొత్త ఆవిష్కరణకు తెరలేపింది.ఈ ఏడాది చివరి నాటికి చంద్రుడి పైకి 4జీ ఇంటర్నెట్ ను తీసుకువెళతామని నోకియా నొక్కి వక్కాణించి చెబుతోంది.

 Nokia To Launch 4g Mobile Network On The Moon In Late 2023,nokia,4g Network,moon-TeluguStop.com

దీని కోసం ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను కూడా పూర్తి చేసేసినట్టు కంపెనీ తెలిపింది.రానున్న రోజుల్లో నెట్ వర్క్ పరికరాల కోసం నోకియా స్పేస్ఎక్స్ రాకెట్లను లాంచ్ వెహికల్ గా ఉపయోగించబోతుందని నోకియా బెల్ ల్యాబ్స్ కి చెందిన ప్రిన్సిపల్ ఇంజనీర్ లూయిస్ మాస్ట్రో రూయిజ్ డి టెమినో ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టెమినో మాట్లాడుతూ… అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ అయిన ఇంట్యూటివ్ మెషిన్స్ రూపొందించిన నోవా-సీ ల్యాండర్( Nova-C lunar lander ) లో యాంటెనా ఉన్న బేస్ స్టేషన్ సహాయంతో ఈ నెట్ వర్క్ పనిచేస్తుందని వివరణ ఇచ్చారు.లాంచ్ వెహికల్ లోని ల్యాండర్, రోవర్ మధ్య 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ( 4G LTE Connectivity )ని అందించనున్నట్లు కూడా అయన తెలిపారు.ఇకపోతే అంతరిక్షంలోని వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఈ టెక్నాలజీకి ఉందని కంపెనీ చాలా ధీమాని వ్యక్తం చేస్తుంది.భవిష్యత్తులో సర్వ సాధారణం కానున్న అంతరిక్ష యాత్రలకు నెట్ వర్క్ కనెక్టివిటీ అందించడం సాధ్యమయ్యే విషయమేనని నిరూపించాలని కంపెనీ భావిస్తుంది.

ఇక ఈ 4జీ నెట్ వర్క్ సాయంతో వ్యోమగాములు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చని కూడా వారు చెబుతున్నారు.అవసరమైతే రిమోట్ గా రోవర్ ను కూడా నియంత్రించవచ్చని కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది.రియల్ టైమ్ వీడియో ఫుటేజ్ తో పాటు ఇతర డేటాను కూడా కంట్రోల్ సెంటర్ కు పంపవచ్చునని కంపెనీ తెలిపింది.ఇక ల్యాండర్ ను చంద్రుడి ఉపరితలంపైకి తీసుకెళ్లే బాధ్యత స్పేస్ ఎక్స్ రాకెట్( SpaceX rocket )కు ఉండదని, ఫైనల్ ల్యాండింగ్ జరిగేలా ప్రొపల్షన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని టెమినో తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube