ఆ మొబైల్ ప్లాంట్ లో 42 మందికి కరోనా పాజిటివ్?

కరోనా వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు.అలాంటి దారుణమైన వైరస్ అది.

 Nokia Mobile Plant Coronavirus-TeluguStop.com

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ గత ఐదు నెలలుగా ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది.ఎన్నో లక్షలమంది ఈ కరోనా బారిన పడి ప్రాణాలను వదిలారు.

అలాంటి ఈ కరోనా వైరస్ బారిన మన భారత్ కూడా పడింది.

 Nokia Mobile Plant Coronavirus-ఆ మొబైల్ ప్లాంట్ లో 42 మందికి కరోనా పాజిటివ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మన భారత్ లో నిన్న సాయింత్రానికి లక్ష యాబై వేలమంది కరోనా బారిన పడ్డారు.

లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ కరోనా వైరస్ దారుణంగా పెరుగుతుంది.అయితే ఇలా పెరుగుతున్న సమయంలో కొన్నింటికి సడలింపు ఇచ్చారు.

అలానే ప్రముఖ మొబైల్ కంపెనీ అయినా నోకియాకి ఇచ్చారు.దీంతో ఆ నోకియా ప్లాంట్ లో 42 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.

అసలు ఎక్కడ వచ్చింది అంటే? తమిళ్ నాడులో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా శ్రీ పెరంబదూర్ లోని నోకియా ప్లాంట్ లో 42 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.దీంతో వెంటనే ఆ ప్లాంట్ ను అధికారులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.కరోనా వైరస్ సోకినా సిబ్బందిని ఐసొలేషన్ కి తరలించగా ప్లాంట్ ను మొత్తం శానిటైజర్ తో శుభ్రం చేస్తున్నారు.

ఉద్యోగులతో కాంటాక్ట్ అయిన వారి వివరాలను వైద్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు.

#India #Coronavirus #Nokia #Nokia Plant #Mobile Company

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు