అతి త్వరలో భారత్ లో నోకియా ల్యాప్‌టాప్స్..!  

ఇది వరకు మనం చిన్నప్పుడు ఏదైనా ఫోన్ లు ఎక్కువగా చూసాము అంటే అవి నోకియా కంపెనీ యొక్క ఫీచర్ ఫోన్స్ మాత్రమే.ఆ తర్వాత టెక్నాలజీలో మార్పుల కారణంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం పరిపాటిగా మారిపోయింది.

TeluguStop.com - Nokia Laptops India Bis Certification

శాంసంగ్, షియోమీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలు ఎక్కువగా రావడంతో నోకియా మార్కెట్ పాతాళానికి పడిపోయింది.దీంతో ఇప్పుడు నోకియా ఫోన్లు కొనే మనిషి లేకుండా పోయాడు.

ఇకపోతే తాజాగా నోకియా సంస్థ ఇప్పుడు ల్యాప్‌ టాప్స్ ను భారతదేశం లోకి తీసుకరాబోతున్నాయి.

TeluguStop.com - అతి త్వరలో భారత్ లో నోకియా ల్యాప్‌టాప్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image

అతి త్వరలో భారతదేశంలో కొత్త సిరీస్ ల్యాప్‌ టాప్స్ ను నోకియా బ్రాండ్ తో హెచ్ఎండి గ్లోబల్ సంస్థ తరఫున విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

అందిన సమాచారం మేరకు నోకియా సంస్థ మొత్తం 9 ల్యాప్‌ టాప్స్ మోడళ్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గుర్తింపు కోసం అప్లికేషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది.దింతో నోకియా కంపెనీ భారతదేశంలో ల్యాప్‌ టాప్స్ ను అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలు అనుకుంటున్నాయి.

అయితే ఇది వరకే నోకియా సంస్థ పర్సనల్ కంప్యూటర్లు, అలాగే ల్యాప్‌ టాప్స్ ను కూడా తయారు చేసింది.

భారతదేశంలో నోకియా కంపెనీ తాజాగా హెచ్ఎండి గ్లోబల్ కంపెనీతో ల్యాప్‌ టాప్స్ వ్యాపారాన్ని పునరుద్ధరించబోతోంది.ఇందులో భాగంగానే మొత్తం తొమ్మిది మోడళ్లను భారతదేశంలో రిలీజ్ చేయబోతున్నారు.కాకపోతే, ఇప్పటికి ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారంని నోకియా యాజమాన్యం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

కాకపోతే అతి త్వరలోనే మార్కెట్లోకి వస్తోన్నట్లుగా నోకియా సైట్ లో కనబడుతోంది.అయితే ఈ ల్యాప్‌ టాప్స్ ను ఓ చైనా సంస్థ తయారు చేయనుంది.ఒకవేళ ల్యాప్‌ టాప్స్ భారతదేశంలో విడుదల చేస్తే గనుక దిగ్గజ ఆన్లైన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మడానికి అందుబాటులో ఉంచవచ్చు.

#NokiaTo #Nokia Laptops #Nokia #Mobile Phones

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు