ఆ జంతువుల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక యాప్..?!

జంతువులంటే చాలా మందికి ఇష్టం.ఈ మధ్యకాలంలో జంతువులను ప్రతి ఒక్కరూ పెంచుకుంటూ ఉంటున్నారు.

 Noida Officers Launched Pet Registration App-TeluguStop.com

అందులో ముఖ్యంగా పిల్లులను, కుక్కలను పెంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.అందుకే నోయిడా అధికారులు పెంచుకునే జంతువుల కోసం ‘పెట్ రిజిస్ట్రేషన్‘ పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్‌ ను డెవలప్ చేశారు.

నోయిడాలో చాలా మంది జంతువులను పెంచుకుంటున్నారు.అలా జంతువులను పెంచుకునేవారు ఇకపై పెట్స్‌కు రిజిస్ట్రేషన్ చేయించాలని అధికారులు తెలియజేశారు.

 Noida Officers Launched Pet Registration App-ఆ జంతువుల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక యాప్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నోయిడా అథారిటీ పెట్ రిజిస్ట్రేషన్ యాప్‌ లో వారు పెంచుకునే జంతువుల సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.ఆ తర్వాత వారు పెంచుకునే పెంపుడు జంతువు ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ కోసం ఏడాదికి వెయ్యి రూపాయలు కట్టాల్సి ఉంటుంది.అదేవిధంగా సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ను రెన్యువల్ చేయించాల్సి ఉంటుంది.

బహిరంగ ప్రదేశాలలో పెంపుడు జంతువులకు సంబంధించిన చెత్తాచెదారం వేస్తే వాటిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.ఈ పెట్స్ మీద ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కూడా దానికి యజమాని పూర్తి బాధ్యత వహించాలి.

తమ పెంపుడు జంతువులు తప్పు చేస్తే ఆ యజమాని తప్పకుండా జరిమానా చెల్లించాలి.సంబంధిత అథారిటీ నుంచి అధికారిక పెట్ లైసెన్స్ పొందిన తరువాతనే పెంపుడు జంతువులను కలిగి ఉన్న వ్యక్తులు 15 రోజుల్లోపు అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.

యజమానులు పార్కు, వీధి, రోడ్లు మొదలైన ఏ ప్రాంతంలోనూనా కుక్కను విచ్చలవిడిగా తిప్పకూడదు.

Telugu Cat, Dog, Dogs And Cat, Domestic Animals, Latest News, Launched, New Android App, New Application, Noida, Noida Officers, One Thousand Fee, Pet Registration App, Registration, Viral Latest-Latest News - Telugu

అలాగే రోడ్లు, వీధులు, ఉద్యానవనాలు మొదలైన ప్రాంతాల్లో మలవిసర్జన చేయకూడదు.పెంపుడు జంతువులు ఇతరులకు హాని చేయకుండా ప్రజలకు వాటి నుంచి ఎటువంటి ముప్పు, ఇబ్బంది వాటిల్లకుండా అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.ఒకవేళ పెంపుడు జంతువు గురించి తప్పుడు సమాచారం ఇస్తే ఆ జంతువు యజమాని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఈ ప్రాసెస్ పెట్టడం వల్ల చాలా మందికి మంచి జరిగే అవకాశం ఉంది.

#Noida #Dogs #Pet #Android #Thousand Fee

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు