రెండో సారి కెప్టెన్‌గా నోయ‌ల్‌.. చివ‌ర్లో ఊహించ‌ని ట్విస్ట్‌?

కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఇటీవ‌ల ప్రారంభ‌మైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్‌.ఆరో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

 Noel To Become Bigg Boss House Captain! Noel, Bigg Boss House Captain, Captain,-TeluguStop.com

ఇప్ప‌టికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు.ఇక రోజులు గ‌డుస్తున్న కొద్ది బిగ్ బాస్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది.

కొత్త కొత్త టాస్కుల‌తో బిగ్ బాస్.ఇంటి స‌భ్యుల ఒల్లు హూనం చేసేస్తున్నాడు‌.

ఈ వారం కెప్టెన్ పోటీదారుల కోసం బిగ్ బాస్ `అమీతుమీ` టాస్క్ ఇవ్వ‌గా.ఎక్కువ డీల్స్‌ను ఫినిష్ చేసిన అఖిల్‌ టీమ్ విజ‌యం సాధించింది.

అనంత‌రం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన వారికి `కొట్టు తలతో ఢీ కొట్టు` అనే టాస్క్ ఇచ్చారు.త‌ల‌కు బ్యాటు క‌ట్టుకుని వారికి ఇచ్చిన‌‌ క‌ల‌ర్ బాల్స్‌ను నెట్‌లో వేయాల్సి ఉంటుంది.

ఈ టాస్క్‌కి అవినాష్‌ని సంచాలకుడిగా వ్య‌వ‌హ‌రించారు.ఈ కెప్టెన్సీ టాస్క్‌లో అమ్మ రాజశేఖర్ మాస్టర్, అఖిల్, నోయల్, దివి, కుమార్ సాయి, హారికలు పాల్గొన్నారు.

అయితే ఆ గేమ్‌లో నోయ‌ల్ ఎక్కువ బాల్స్ నెట్‌లో వేయడంతో.రెండో సారి కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.దీంతో ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సోహైల్ తన కెప్టెన్ బ్యాండ్‌ని తీసి నోయల్‌కి త‌గిలించారు.దీంతో నోయ‌ల్ ఆనందానికి అవ‌దులు లేకుండా పోయాయి.

అయితే బిగ్ బాస్ చివ‌ర్లో ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు.వాస్త‌వానికి కెప్టెన్ అయితే.

నామినేషన్స్ నుంచి ఇమ్యునిటీ ల‌భిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

కానీ, నోయ‌ల్‌కు మాత్రం ఇమ్యునిటీ ల‌భించ‌లేదు.

ఎందుకంటే, అమీతుమీ టాస్క్‌లోని చివరి డీల్‌లో.ఎవరో ఒకరు వ‌చ్చే వారం నేరుగా నామినేట్ అవ్వాల‌ని.

దీనికి 30 బంగారు నాణేలు ఇవ్వాల్సి ఉంటుందని బిగ్ బాస్ డీల్ ఇచ్చారు.డీల్‌లో భాగంగా.

నోయ‌ల్ సెల్ఫ్‌ నామినేట్ అయ్యాడు.ఈ క్ర‌మంలోనే అమీతుమీ టాస్క్‌లో నేరుగా నామినేట్ అయినందున త‌ర్వాతి వారంలో అత‌డికి ఇమ్యూనిటీ ల‌భించ‌ద‌ని బిగ్‌బాస్ వెల్ల‌డించారు.

దీంతో నోయ‌ల్ కెప్టెన్ అయిన‌ప్ప‌టికీ.వ‌చ్చే వారం నామినేష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube