బిగ్ బాస్ తనను తొక్కేశాడంటున్న నోయల్..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఈ షో గురించి సంచలన ఆరోపణలు చేస్తున్నారు.ఇప్పటికే పలు వివాదాల ద్వారా విమర్శలు మూటగట్టుకుంటున్న బిగ్ బాస్ షోకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు చేస్తున్న వ్యాఖ్యలు మరింత వ్యతిరేకతను పెంచుతున్నాయి.

 Noel Sensational Comments About Bigg Boss Show,  Bigg Boss Show, Noel Sean, Hela-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో కూల్ గా ఉంటూ ఆరోగ్య సమస్యల వల్ల ఎలిమినేట్ అయిన నోయల్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ తనను తొక్కేశాడంటూ తీవ్ర స్థాయిలో నోయల్ విమర్శలు చేశారు.

ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన నోయల్ ను పలు టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు ఇంటర్వ్యూలు చేసి బిగ్ బాస్ షోకు సంబంధించిన విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.గతంలో ఎలిమేనేట్ అయిన స్వాతి దీక్షిత్ చెప్పిన విధంగానే స్క్రీన్ స్పేసింగ్ ఎక్కువగా దక్కలేదని నోయల్ తెలిపారు.

తాను హౌస్ లో ఉన్నంత వరకు ప్రసారమైన ఎపిసోడ్లను చూస్తే తన కంటెంట్ అస్సలు కనిపించలేదని అన్నారు.

తనకు హౌస్ లో ఉన్నానా లేక బాత్ రూమ్ లో దాక్కున్నానా.? అనే అనుమానం కలిగిందని నోయల్ వెల్లడించారు.వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ తో తాను చాలా విషయాలను షేర్ చేసుకున్నానని అయితే ఆ సన్నివేశాలు ప్రసారం కాలేదని తెలిపారు.

తన ఫుటేజ్ చాలా వరకు మిస్ అయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.టాస్కుల్లో కూడా తాను బాగానే పాల్గొన్నానని కానీ అవి ప్రసారం కాలేదని నోయల్ తెలిపారు.
గత సీజన్లలో కూడా బిగ్ బాస్ షో గురించి ఇదే తరహా ఆరోపణలు వ్యక్తమయ్యాయి.ఒక రోజులో జరిగిన సన్నివేశాలన్నీ బిగ్ బాస్ షోలో చూపించడం సాధ్యం కాదని అందువల్లే ఈ తరహా ఆరోపణలు కంటెస్టెంట్ల నుంచి వినిపిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube