టాలీవుడ్ లో తేజ వెయ్యి అబద్ధాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఎస్తర్.ఈ అమ్మడు తరువాత కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది.
సునీల్ తో భీమవరం బుల్లోడు సినిమాలో సందడి చేసింది.అయితే హీరోయిన్ గా అవకాశాలు భాగానే ఉన్న సమయంలోనే ఎస్తర్, టాలీవుడ్ సింగర్, నటుడు నోయల్ లో ప్రేమలో పడింది.
కొంత కాలం ప్రేమలో ఉన్న వీరు గత ఏడాది చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.అయితే ఊహించని విధంగా తామిద్దరం విడాకులు తీసుకున్నట్లు ఎస్తర్ సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.
గత కొంత కాలంలో వీరు విడిపోయారని వార్తలు వస్తున్న నేపధ్యంలో అవి వాస్తవమే అని క్లారిటీ ఇచ్చింది.ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది.
పెళ్లయిన మరుసటి రోజు నుంచే తామిద్దరి మధ్య సర్దుబాటు సమస్యలు తలెత్తాయని, అలా కొన్ని రోజులకే విడిపోయామని ఎస్తేర్ సంచలన ప్రకటన చేసింది.గతేడాది జూన్ లోనే మ్యూచువల్ డైవోర్స్ కు అప్లై చేశామని వెల్లడించింది.
అధికారికంగా వెల్లడించాలనే ఉద్దేశంతో తాను ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నానని, కోర్టు విడాకులు మంజూరు చేయడంతో క్లారిటీ ఇస్తున్నట్లు పేర్కొంది.తను చాలా విషయాల్లో సూటిగా-నిజాయితీగా ఉంటానని, కానీ ఈ విషయంలో మాత్రం ఇంతకంటే ఎక్కువ స్పందించలేనంటూ ఎస్తర్ చెప్పడం ద్వారా తాను కోరుకునేది ఏదో నోయల్ దగ్గర పొందలేకపోయిందని, అందుకే విడాకులు తీసుకుందని అర్ధం అవుతుంది.
అయితే ఈ విషయంపై ఎస్తర్ క్లారిటీ ఇచ్చిన నోయల్ ఎందుకనో ఇప్పటి వరకు స్పందించలేదు.