బిగ్‌బాస్-4లో భాగంగా ఈ వీక్‌లో కంటెస్టెంట్స్ ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు.ముందుగా కొంతమందిని సేవ్ చేసిన తర్వాత అమ్మ రాజశేఖర్, మెహబూబ్‌ని కన్సెక్షన్ రూమ్‌కి రావాలని నాగార్జున పిలిచాడు.
వారిద్దరు రూంలోకి వెళ్లిన తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్‌తో నాగార్జున ఓట్లు వేయించారు.ఒక బోర్డు మీద ఇద్దరి ఫొటోలను పెట్టి ఓట్లు వేయాలని మిగిలిన కంటెస్టెంట్స్‌ను నాగార్జున కోరాడు.
అవినాష్, అరియానా తప్పితే మిగిలిన కంటెస్టెంట్స్ మెహబూల్ హౌస్‌లో ఉండాలంటూ ఓట్లు వేశారు.దీంతో మెహబూబ్ సేఫ్ అని ప్రకటించిన నాగార్జున.
ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది.
అమ్మ రాజశేఖర్ తన లగేజీ తీసుకుని బిగ్‌బాస్ హౌస్‌ను వదిలేందుకు సిద్ధమవుతుండగా.నాగార్జున బాంబ్ పేల్చారు.
అనారోగ్యంతో ఈ వారం బయటికి వెళ్లిన నోయల్.తాను వెళుతున్నాను గనుక ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేయవద్దని బిగ్‌బాస్‌కు చెప్పాడని, దానికి బిగ్‌బాస్‌కు ఓకే అన్నాడని నాగార్జున చెప్పాడు.
అంతేకాకుండా వచ్చేవారం డైరెక్ట్‌గా అమ్మ రాజశేఖర్‌కు కెప్టెన్సీ ఇస్తున్నట్లు నాగార్జున తెలిపాడు.
మొత్తానికి నోయల్ వల్ల ఈ వారం ఎలిమినేట్ కావాల్సిన రాజశేఖర్ సేవ్ అయ్యాడు.
తాను హౌస్ నుంచి బయటికి వెళ్లాలంటూ ఓటు వేసిన వారిపై అమ్మ రాజశేఖర్ గుర్తుగా ఉన్నాడు.దీంతో ఈ వారంలో బిగ్‌బాస్ హోస్ మరింత వేడెక్కే అవకాశముంది.