బిగ్‌బాస్‌ : అతడి రీ ఎంట్రీ అస్సలు ఛాన్సే లేదు

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 నుండి ఎనిమిది వారాల తర్వాత నోయల్‌ అనారోగ్య కారణాల వల్ల ఎలిమినేట్‌ అయ్యాడు.ఆయన అనారోగ్య సమస్యల నుండి బయటకు వచ్చాడని ఆయన నొప్పుల నుండి తేరుకున్నాడని అందుకే మళ్లీ రీ ఎంట్రీ విషయమై ఆలోచిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

 Noel Re Entry In Telugu Bigg Boss Is Not Real News, Telugu Big Boss 4, Noel, Nag-TeluguStop.com

సోషల్‌ మీడియాలో ఆయన స్పందిస్తూ బిగ్‌బాస్‌ అంటే ఏదైనా జరగవచ్చు అంటూ మాట్లాడాడు.నేను రీ ఎంట్రీ ఇస్తానా అనే విషయం తెలియదు అంటూ అందరు కూడా నోయల్‌ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నట్లుగా చర్చించుకునేలా మాట్లాడాడు.

దాంతో మీడియాలో కూడా నోయల్‌ రీ ఎంట్రీ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది.అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చిన నోయల్‌ ను మళ్లీ పంపడం వల్ల గేమ్‌ తప్పు దారి పట్టే అవకాశం ఏమీ లేదని, ఎవరు కూడా విమర్శించక పోవచ్చు అనుకున్నారు.

కాని ఆయన రీ ఎంట్రీ లేదు అంటూ క్లారిటీ వచ్చేసింది.

స్వయంగా నోయల్‌ మాటలతో రీ ఎంట్రీ పుకార్లే అంటూ క్లారిటీ వచ్చేసింది.

నోయల్‌ రీ ఎంట్రీ విషయం గురించి మాట్లాడుకుండా బిగ్‌ బాస్‌ లో తాను ఏం చేశాను అనేది చూపించలేదు.నేను ఏమైనా బాత్‌ రూంలో దాచుకున్నానా అంటూ బిగ్‌బాస్‌ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశాడు.

పులిహోర బ్యాచ్‌ ను మాత్రమే ఎక్కువగా చూపిస్తున్నారు అంటూ నోయల్‌ అసహనం వ్యక్తం చేయడంతో పాటు బిగ్‌బాస్ టీం పై విమర్శలు గుప్పించాడు.దాంతో బిగ్‌ బాస్‌ లోకి మళ్లీ ఆయన వెళ్లే ఛాన్స్‌ లేదు అంటూ ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది.

ఆయన రీ ఎంట్రీ విషయంలో కొందరు ఆశలు పెట్టుకుంటే ఆయన మాటలతో మొత్తం క్లారిటీ వచ్చేసింది. బిగ్‌బాస్‌ టీంను అన్నేసి విమర్శలు చేసిన తర్వాత ఆయన మళ్లీ బిగ్‌బాస్‌ కు వెళ్తాడు అనుకోవడం పిచ్చి పొరపాటు అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి బిగ్‌బాస్‌ లో నోయల్‌ ప్రస్థానం మళ్లీ మొదలు అయ్యే అవకాశమే లేదు అంటూ ఆయన కూడా చెప్పకనే చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube