ఇన్ని ఇబ్బందుల్లో ఉండటం అవసరమా నోయల్‌?  

noel health not good so he should leave bb house, noel sean, bigg boss house,, gangavva, health condition, bb day care task, medical room - Telugu Bb Day Care Task, Bb4 Telugu, Bigg Boss House, Gangavva, Health Condition, Medical Room, Noel Biggboss, Noel Health Not Good So He Should Leave Bb House, Noel Sean, Rahul

తెలుగు బిగ్‌బాస్‌ గత మూడు సీజన్‌లతో పోల్చితే ఈసారి ఏమాత్రం ఆకట్టుకోలేక పోతుంది.మొదటి మూడు సీజన్‌లలో ఏదో ఒక అంశం హైలైట్‌ అవుతూ వచ్చింది.

TeluguStop.com - Noel Health Not Good So He Should Leave Bb House

కాని ఈసారి మాత్రం కంటెస్టెంట్స్‌ అనారోగ్యం హైలైట్‌ అవుతూ వస్తున్నాయి.గంగవ్వ ను ప్రత్యేకంగా తీసుకుని ఆమెను స్పెషల్‌గా చూపించే ప్రయత్నం చేస్తే ఆమె నా వల్ల కావడం లేదు ఆరోగ్యం బాగుండటం లేదు అంటూ వెళ్లి పోతాను అంటూ రెండవ వారం నుండే గొడవ చేయడంతో ఆమెను అయిదు వారాల తర్వాత బయటకు పంపించారు.

ఇక నోయల్ వెళ్లినప్పటి నుండి కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడట.ఆ విషయం చెప్పి నోయల్‌ ను ఒక వారం గంగవ్వ ఎలిమినేషన్‌ కు నామినేట్‌ కూడా చేసింది.

TeluguStop.com - ఇన్ని ఇబ్బందుల్లో ఉండటం అవసరమా నోయల్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నోయల్‌ కు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది.ఆ కారణంగా ఆయన టాస్క్‌లో ఎప్పుడు కూడా సరిగా ఉండలేక పోతున్నాడు.

నోయల్‌ గాయం వల్ల మొన్న జరిగిన బిబి డేకేర్‌ టాస్క్‌ కూడా నీరు గారి పోయినట్లయ్యింది.అవినాష్‌ కు కేర్‌ టేకర్‌గా వ్యవహరించాల్సిన నోయల్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తప్పుకున్నాడు.

మొదట కాస్త ప్రయత్నించినా కూడా ఆ తర్వాత విపరీతమైన బాడీ పెయిన్‌ అంటూ మెడికల్‌ రూంకు వెళ్లాడు.అక్కడ డాక్టర్‌ వచ్చి చూస్తాడంటూ చెప్పారు అని బయటకు వచ్చి చెప్పాడు.

మొత్తానికి నోయల్‌ వల్ల ఆట డిస్ట్రబ్‌ అవుతుందనే కామెంట్స్‌ వస్తున్నాయి.ప్రేక్షకులు కూడా నోయల్‌ పట్ల ఆసక్తిని కోల్పోయారు.

అందుకే నోయల్‌ ఎప్పుడైతే నామినేషన్‌లోకి వస్తాడో అప్పుడు ఖచ్చితంగా ఎలిమినేట్‌ చేయాలని సిద్దంగా ఉన్నారు.ఈ విషయంలో ఆయన ఫాలోవర్స్‌ కూడా ఆయనకు మద్దతుగా లేరు.

ఎందుకంటే ఇంత ఇబ్బంది పడుతూ ఉండటం ఎందుకు అంటూ వారు అంటున్నారు.

#Rahul #Noel Sean #Medical Room #Gangavva #NoelHealth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Noel Health Not Good So He Should Leave Bb House Related Telugu News,Photos/Pics,Images..