పంచెకట్టులో నోబెల్ తీసుకున్న ప్రవాస భారతీయుడు

భారతీయులు ఎక్కడున్నా తమ ప్రత్యేకత చాటుతూ ఉంటారు.భారతీయతని చూపించడం ద్వారా తమ దేశం గొప్పతనం ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటారు.

 Nobel Prize Winner Abhijit Banerjee Dhoti And Bandhgala-TeluguStop.com

అప్పుడప్పుడు ఇలాంటి అరుదైన ఘటనలు ప్రపంచ వేదికల మీద చూస్తూ ఉంటాం.ఇప్పుడు నోబెల్ అవార్డు వేదిక మీద కూడా భారత సంతతి ఆర్దివేత్త అభిజిత్ బెనర్జీ తన ప్రత్యేకత చాటుకొని భారతీయులతో ప్రశంసలు అందుకున్నారు.

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ భారతీయ సంప్రదాయం దుస్తులైన పంచెకట్టులో నోబెల్ బహుమతి తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా అభిజిత్ ఘనత సాధించారు.

అతని భార్యతో కలిసి అవార్డు అందుకున్న ఈ వేడుకలో అభిజిత్ భార్య ఎస్తర్ దుఫ్లో కూడా కూడా సంప్రదాయ చీరతో మెరిశారు.

వీరిద్దరితో పాటు మైకెల్ క్రెమెర్ ఈ బహుమతిని పంచుకున్నారు.వీరికి ఈ రోజు నోబెల్ బహుమతి ప్రదానం చేశారు.అయితే ఈ కార్యక్రమానికి అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ దుఫ్లో భారతీయ సంప్రదాయంలో కనిపించి అందరినీ ఆకర్శించారు.అభిజిత్ తెలుపు పంచె, నల్ల చొక్కాలో కనిపించగా, ఎస్తర్ ఆకుపచ్చ, నీలంరంగు కలపోతలో ఉన్న చీరతో ఆకట్టుకున్నారు.

ఇలా భారతీయతని చూపిస్తూ ప్రపంచ నోబెల్ వేదిక మీద నోబెల్ అవార్డు అందుకోవడంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.ఇండియాలో చాలా మంది చీరని, పంచె కట్టుని విమర్శిస్తూ ఏదో గొప్పగా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో అభిజిత్ దేశం యొక్క గొప్పతనం చూపించాడని మెచ్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube