వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులకు నెల జీతం కట్.. ఎక్కడంటే...?

ఓ పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్సేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తుండగా మరోపక్క కొందరు వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కొవిడ్  టీకా వేసుకునేందుకు వెనుకాడుతున్న ఉద్యోగులను దారిలో పెట్టేందుకు ఆ యంత్రాంగం కొత్త రూల్ ని ప్రవేశపెట్టింది.

 No Vaccination No Salary For Government Employees Up Firozabad, Up Firozabad, Fi-TeluguStop.com

ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోరో వారికి నెల జీతాన్ని కట్ చేసేలా నిబంధన పెట్టింది.ఇంతకీ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లాలో అని తెలుస్తుంది.

జిల్లాలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కరోనా వ్యాక్సిన్ అంటే సుముఖత చూపడం లేదు.అందుకే వారి కోసం అధికారులు వ్యాక్సిన్ వేయించుకోని వారికి నెల జీతం కట్ చేసేలా నిబంధనలు పెట్టారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జీతం రాకపోతే ఎలా ఉంటుందో తెలిసిందే.అందుకే ఉద్యోగులను టీకా వేయించుకునేలా జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర విజయ్ సింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

టీకా వద్దన్న ఉద్యోగులపై విచారణ జరిపించడమే కాకుండా నెల జీతం చెల్లించడాన్ని నిలిపి వేయాలని అన్నారు.వివిధ డిపార్ట్ మెంట్లలో ఉన్నతాధికారులకు ఇప్పటికే ఈ రకమైన ఆదేశాలు జారీ చేశారు.

ఉద్యోగం చేస్తూ నెల జీతం అందుకోకపోవదం ఎందుకని వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకొస్తున్నారు కొందరు ఉద్యోగులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube