లాక్‌డౌన్‌ ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు

దేశ వ్యాప్తంగా నెల రోజులకు పైగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోయినా కూడా ప్రజల ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో మళ్లీ పుంజుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో కరోనా వైరస్‌కు భయపడ్డ కేంద్ర ప్రభుత్వం 45 రోజుల లాక్‌డౌన్‌ను విధించింది.

 No Uses Of World Lock Down, Coronavirus, Lock Down,corona Cases-TeluguStop.com

లాక్‌డౌన్‌ను విధించినా కూడా కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది.గడచిన 10 రోజుల్లో ఏకంగా 10 వేల కేసులు నమోదు అయినట్లుగా సమాచారం తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా కూడా ఈ 10 వేల కేసులు నమోదు అయ్యాయి.

ఈ లెక్కన చూస్తే లాక్‌డౌన్‌ వల్ల పెద్దగా ప్రయోజనాలు లేవు కదా అంటున్నారు.

లేదంటే లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడం లేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి లాక్‌డౌన్‌ పీరియడ్‌ ఆర్థికంగా దేశం నష్టపోవడంతో పాటు కరోనా నుండి విముక్తి కూడా కావడం లేదంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవివేకులు కొందరు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా లాక్‌డౌన్‌నును పట్టించుకోకుండా చిల్లర వ్యవహారాల కోసం బయట తిరగడం చేస్తున్నారు.ఆ కారణంగానే ఇలా కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు.

లాక్‌డౌన్‌ వల్ల ప్రయోజనం ఉందని, ఈ లాక్‌డౌన్‌ లేకుంటే లక్షల్లో కేసులు నమోదు అయ్యేవి అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube