బాలయ్య మౌనం వెనుక మర్మమేమిటి?  

నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు బోయపాటి తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడు.

TeluguStop.com - No Updates On Balakrishna Boyapati Sreenu Movie

కాగా గతేడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా ఇంకా పూర్తి మాత్రం కాలేదు.కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో, ఈ సినిమా ఎంతవరకు పూర్తయ్యిందనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది.

ఇక సంక్రాంతి కానుకగా ప్రస్తుతవం పలువురు స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు.అటు మరికొంత మంది తమ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు, టీజర్లు రిలీజ్ చేస్తూ పండగకు ఫ్యాన్స్‌ను సంతోష పెడుతున్నారు.

TeluguStop.com - బాలయ్య మౌనం వెనుక మర్మమేమిటి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ బాలయ్య మాత్రం ఈ సంక్రాంతికి సైలెంట్‌గా ఉండిపోయాడు.ఆయన నటిస్తున్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

గతేడాది బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఆ తరువాత నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా ఎంతవరకు వచ్చిందనే విషయంపై ఆందోళన చెందుతున్నారు.

వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తారని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.కానీ ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రవర్తనతో ఈ సినిమా వేసవి కానుకగా రిలీజ్ అవుతుందో లేదో అనే సందేహం వారిలో నెలకొంది.

మరి ఈ సినిమా విషయంలో బాలయ్య మౌనం వెనక అసలు మర్మం ఏమిటో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి ఏదో ఒక అప్‌డేట్ ఖచ్చితంగా వచ్చి తీరాలి.ఇక బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ప్రగ్యా మార్టిన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

#Balakrishna #Boyapati Sreenu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు