ఫ్యాన్స్ ని మళ్ళీ నిరాశపరిచిన ఆర్ఆర్ఆర్.. ఎలాంటి అప్డేట్ ఉండబోదు?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్“.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు.

 No Update From Rrr For This Vinayaka Chavithi,  Rrr Movie, Rrr, Ram Charan, Raja-TeluguStop.com

చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు కలిసి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందనే ఊహతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమైంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ “ది రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అంటూ విడుదల చేసిన మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకునీ ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచుతున్నాయి.ఇదిలా ఉండగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలో నుంచి విడుదలైన “దోస్తీ” అనే పాటకు విశేష ఆదరణ వచ్చింది.

ఇలా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Telugu Dosti, Alia Bhatt, Jr Ntr, Olivia Morris, Rajamouli, Ram Charan, Roar Rrr

వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి సినిమా నుంచి అప్డేట్స్ వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి కూడా అప్డేట్ వస్తుందని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే చిత్ర బృందం వినాయకచవితి సందర్భంగా ఎలాంటి అప్డేట్ ఉండదనే వార్తలు రావడంతో అభిమాని లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమా నుంచి పండుగ సందర్భంగా అప్డేట్ ఉంటుందా లేదా అనే విషయం గురించి చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube