టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కి్స్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని మహేష్ ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా తన నెక్ట్స్ చిత్రాన్ని మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో చేయబోతున్నట్లు ఎప్పటినుండో ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.
అటు జక్కన్న కూడా తన నెక్ట్స్ చిత్రాన్ని మహేష్‌తో చేయబోతున్నట్లు ప్రకటించాడు.
అయితే టాలీవుడ్లో మహేష్ బాబు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 1-నేనొక్కడినే సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమా అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది.
కానీ ఈ సినిమా టీవీలో వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది.ఇలాంటి వైవిధ్యమైన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎందుకు ఫెయిల్ అయిందా అని అందరూ అనుకుంటారు.
అయతే సుకుమార్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉండటంతో, మరోసారి మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తే బాగుండని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
ముఖ్యంగా మహేష్ అభిమానులు సుకుమార్‌తో మహేష్ సినిమా ఉంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని వారు ఆశిస్తున్నారు.
దీంతో మహేష్-సుకుమార్ కాంబోలో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమా గనక నిజంగా సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల వర్షం కురిపిస్తుందా అని వారు లెక్కలు గడుతున్నారు.
ఏదేమైనా మహేష్ సుకుమార్ కాంబో గురించి మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతుండటం విశేషం.