బోల్డ్ డైరెక్టర్ సినిమా ఉందా లేదా?

టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి అనే ఒకేఒక్క చిత్రంతో తన సత్తా ఏమిటో చాటాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

 No Update From Sandeep Reddy Vanga, Sandeep Reddy Vanga, Arjun Reddy, Kabir Sing-TeluguStop.com

ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్ రెడ్డి, హీరోగా విజయ్ దేవరకొండను మరో స్థాయిలో తీసుకెళ్లి నిల్చోబెట్టాడు.ఇక ఈ సినిమా అందించిన సక్సెస్‌తో వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతాడని అందరూ అనుకున్నారు.

కానీ, ఈ డైరెక్టర్ తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా తరువాత మరే ఇతర సినిమా చేయలేదు.తనకు ఫేం తీసుకొచ్చిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని బాలీవుడ్‌లో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించి అక్కడ కూడా అదిరిపోయే హిట్ అందుకున్నాడు ఈ డైరెక్టర్.

ఇక ఇప్పుడు మరోసారి తన సత్తా చాటేందుకు టాలీవుడ్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించాలని చూస్తున్నాడు.అయితే సందీప్ రెడ్డి కథను చాలా మంది హీరోలు విన్నా, ఎవరూ ఓకే చేయలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

దీంతో చిర్రెత్తిపోయిన సందీప్ రెడ్డి, మరోసారి బాలీవుడ్‌ను నమ్ముకున్నాడట.

అనుకున్నదే ఆలస్యంగా తన సినిమాలో యంగ్ హీరో రణ్‌బీర్ కూపర్‌ను హీరోగా పెట్టుకుని అదిరిపోయే సినిమాను తెరకెక్కించేందుకు సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నడు.

ఇప్పటికే కథను ఓకే చేసిన ఈ హీరో, త్వరలో షూటింగ్ మొదలుపెట్టేందుకు కూడా రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించి టాలీవుడ్ హీరోలకు ఝలక్ ఇవ్వాలని సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు.

మరి ఈ డైరెక్టర్ తెరకెక్కించబోయే ఈ సినిమా ఎలా ఉండనుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube