అనుష్క కోసం తప్పని ఎదురుచూపులు.. ఏం జరిగిందంటే.?

స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా నిశ్శబ్దం విడుదలై నాలుగు నెలలు గడిచింది.రెండేళ్ల క్రితం వరకు వేగంగా సినిమాలు చేసిన అనుష్క సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు.

 No Update From Anushka  Uv Creations Movie,tollywood ,nishbdam ,anushka ,amazon-TeluguStop.com

ప్రస్తుతం అనుష్క రారా కృష్ణయ్య సినిమా డైరెక్టర్ మహేష్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఎక్కువ మార్కెట్ కలిగిన హీరోయిన్ గా అనుష్కకు గుర్తింపు ఉంది.

అనుష్క సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయి.

అయితే మహేష్ డైరెక్షన్ లో అనుష్క సినిమా ఫైనల్ అయినా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది ? అనే విషయాల గురించి చిత్రయూనిట్ కు సైతం స్పష్టత లేదని తెలుస్తోంది.మరోవైపు ఈ మూవీ షూటింగ్ ఇప్పట్లో ప్రారంభం కాదని కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే అనుష్క ఫ్యాన్స్ మాత్రం అనుష్క నటించిన ఒక్క సినిమా అయినా ఈ ఏడాది విడుదలైతే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Telugu Amazon Prime, Anushka, Nishabdam, Uv-Movie

మరి అనుష్క మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందని గతంలో ఈ సినిమా తరహా కాన్సెప్ట్ తో ఏ సినిమా తెరకెక్కలేదని తెలుస్తోంది.అనుష్క ఈ సినిమాకు డేట్స్ కేటాయిస్తే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉంటాయి.

త్వరలో చిత్రయూనిట్ నుంచి ఈ సినిమాకు సంబంధించి థ్రిల్లింగ్ అప్ డేట్ రానుందని తెలుస్తోంది.

మరోవైపు నిశ్శబ్దం సినిమా నటిగా అనుష్కకు మంచి పేరు తెచ్చినా కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ కాలేదు.

అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన నిశ్శబ్దంకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ రాగా బుల్లితెరపై కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లు రాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube