అగ్రరాజ్యంలో కరోనా టెస్టులపై గందరగోళం..!

కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది.

 American Cdc Says If No Symptoms No Need Of Covid Test,corona Virus, Covid-19 Te-TeluguStop.com

అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ చైనీస్ వైరస్ కు వణికిపోతుంది.ఇక ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అయినా అమెరికాలో కరోనా టెస్టులపై గందరగోళం ఏర్పడింది.

అమెరికాలో ప్రతి రోజు కొన్ని వేల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదవుతుంటే వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.ఇక తాజాగా అమెరికాలో కరోనా పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను సడలించారు.

అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలనా కేంద్రం సంచలన మార్గదర్శకాలను విడుదల చేసింది.

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల స్నేహితులకు లక్షణాలు లేకపోతే కరోనా పరీక్షలు అవసరం లేదని సీడీసీ తెలిపింది.

అయితే ఈ మార్గదర్శకాలను అక్కడి మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకించాయి.దాదాపు 30కు పైగా రాష్ట్రాలు వైరస్ సోకినా వారితో సన్నిహితంగా ఉన్నవారు కరోనా లక్షణాలు కనిపించిన వారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేశారు.

దీంతో అక్కడ కరోనా పరీక్షలపై ప్రజలకు గందరగోళం ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube