దీపావళి సీజన్‌ వృదా అయ్యింది. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వెలవెల  

No Stars In Deepawali Movie For This Year-

దసరా పండుగ సందర్బంగా వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది. అదే దసరాకు విడుదలైన ‘పందెం కోడి 2’ మరియు హలో గురు ప్రేమకోసమే చిత్రాలు యావరేజ్‌ టాక్‌ను దక్కించుకున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసి మంచి వసూళ్లను రాబట్టి, దసరా సీజన్‌ను సద్వినియోగం చేసుకున్నాయి. అయితే తాజాగా దీపావళిని మాత్రం టాలీవుడ్‌ హీరోలు వృదా చేసుకున్నారు..

దీపావళి సీజన్‌ వృదా అయ్యింది. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వెలవెల-No Stars In Deepawali Movie For This Year

దీపావళికి పెద్ద సినిమాలు ఏమీ రాలేదు. ఒక తెలుగు సినిమా రెండు డబ్బింగ్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ ముందుకు వచ్చాయి.

తెలుగు సినిమా ‘అదుగో’ దీపావళి కానుకగా రిలీజ్‌ అయ్యింది. అదో అట్టర్‌ ఫ్లాప్‌ మూవీగా మిగిలి పోయింది.

పందితో మూవీ ఎంట్రా అంటూ అసలు ఆ సినిమాను చూసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. ఆ సినిమా గురించి మాట్లాడుకునే వారే కనిపించడం లేదు. ఇక అదుగో తో పాటు ‘సర్కార్‌’ చిత్రం కూడా విడుదల అయ్యింది..

డబ్బింగ్‌ సినిమా అవ్వడం, విజయ్‌కి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా క్రేజ్‌ లేక పోవడం వల్ల ఈ చిత్రం యావరేజ్‌ వసూళ్లను సాధించింది.

అంతకు ముందు విడుదల అయిన ‘సవ్యసాచి’ చిత్రం కూడా యావరేజ్‌ టాక్‌ను దక్కించుకున్న కారణంగా పెద్దగా వసూళ్లను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. మొత్తంగా దీపావళి సీజన్‌ అంతా కూడా వృదా అయ్యింది. డిసెంబర్‌లో రావాలని ఎదురు చూస్తున్న స్టార్‌ హీరోలు దీపావళికి వచ్చి ఉంటే బాగుండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద ఒక్కటి అంటే ఒక్కటి కూడా సినిమా సందడి చేయడం లేదు. ప్రేక్షకులు సినిమాకు వెళ్లాలి అంటే ఏ సినిమాకు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. డిసెంబర్‌ వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశగా ఎదురు చూస్తున్నారు..