షామిలీ రీ ఎంట్రీ ఇప్పట్లో లేదు  

No Shamili In Rajakumari Movie -

బాల నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించి ‘ఓయ్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన షామిలి చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.చదువు వల్ల ఇంత కాలం సినిమాల్లో నటించకుండా ఉన్న షామిలీ మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తుంది.

తమిళంలో ప్రస్తుతం ఈమె రెండు చిత్రాల్లో నటిస్తోంది.ఆ రెండు చిత్రాలు కూడా బ్యాక్‌ టు బ్యాక్‌ రాబోతున్నాయి.

No Shamili In Rajakumari Movie--Telugu Tollywood Photo Image

ఇక షామిలీ తెలుగులో కూడా రీ ఎంట్రీకి సిద్దం అయ్యిందని ప్రచారం జరిగింది.

తెలుగులో నారా రోహిత్‌ హీరోగా ‘కథలో రాజకుమారి’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఆ చిత్రంలో హీరోయిన్‌గా షామిలీని ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షామిలీ తెలుగు రీ ఎంట్రీ ఇప్పట్లో లేదని, ఈమెను తెలుగు నిర్మాతలు ఎవరు కూడా అప్రోచ్‌ కాలేదని తేలిపోయింది.

తెలుగులో ఈమెకు ‘ఓయ్‌’ చిత్రంతో ఫేం రాలేదు.అందుకే ఈమెతో మరో సినిమాను చేసే సాహసం తెలుగు దర్శక నిర్మాతలు చేయడం లేదు.

ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న చిత్రాలు విడుదలై సక్సెస్‌ అయితే తెలుగులో కూడా అవకాశాలు వస్తాయని అంటున్నారు.

తాజా వార్తలు

No Shamili In Rajakumari Movie- Related....

 • -
  -
  -
  -
  -
  -
  -
  -
  -
  -
  -
  -
  -
  -
  -
  -