ఇకపై సినిమాలకు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్స్‌ ఉండవు, మరి ఎలా?  

No Sale Of Movie Tickets On Soon Talasani Srinivas Yadav-no Sale Of Movie Tickets,talasani Srinivas Yadav,telangana Govt

తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది.సినిమా ఇండస్ట్రీలో మోసాలు, దందాలు మరీ ఎక్కువ అవుతున్నాయి.

No Sale Of Movie Tickets On Online Soon Talasani Srinivas Yadav-No Talasani Yadav Telangana Govt

బాగు పడ్డ వారు బాగుపడుతున్నారు ఇబ్బంది పడే వారు మరీ అంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాతలు, బయ్యర్లను బాగు చేసేందుకు థియేటర్‌ యాజమాన్యాల మోసాలకు, దందాలకు అడ్డు కట్ట వేసేందుకు సిద్దం అయ్యారు.

ఇందుకోసం ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ వ్యవస్థను రద్దు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిర్ణయం తీసుకున్నారు.

No Sale Of Movie Tickets On Online Soon Talasani Srinivas Yadav-No Talasani Yadav Telangana Govt

ఈ నిర్ణయంతో బయ్యర్లు మరియు చిన్న నిర్మాతలు లాభపడతారని తలసాని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ది చెందిన టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సింది పోయి ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థను రద్దు చేయడం ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి.అయితే ఈ విమర్శలకు తెలంగాణ ప్రభుత్వం సరైన సమాధానం చెబుతోంది.

ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ వ్యవస్థ రద్దు అయితే చేయడం జరిగింది, కాని భవిష్యత్తులో ఎవరికి అన్యాయం జరుగకుండా కొత్త విధానాలు తీసుకు వస్తామంటూ ప్రకటించాడు.

ప్రభుత్వం ద్వారానే టికెట్ల అమ్మకాలు మరియు కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటారు.ఇలా చేయడం వల్ల ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోల్పోతున్న దాదాపు 500 కోట్ల రూపాయల పన్ను ఆదాయంను తిరిగి రాబట్టుకోవచ్చు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.అలాగే థియేటర్‌ యాజమాన్యులు బయ్యర్లను ఇబ్బంది పెట్టకుండా కూడా ఉంటుందని, థియేటర్లు ఇలా చేయడం వల్ల పారదర్శకత కనిపించడం లేదని అందుకే ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థ రద్దు చేసినట్లుగా ప్రకటించాడు.

దీనిపై సినిమా పరిశ్రమ భిన్నంగా స్పందిస్తోంది.ఏపీలో మాత్రం యధాతథ స్థితి కొనసాగుతోంది.

తాజా వార్తలు

No Sale Of Movie Tickets On Soon Talasani Srinivas Yadav-no Sale Of Movie Tickets,talasani Srinivas Yadav,telangana Govt Related....