ఆర్టీసీ ఒప్పందానికి కరోనా బ్రేక్ …!  

No Rtc Buses Telugu States - Telugu Ap, Corona Cases, Corona Virus, No Transportation Between Telugu States, Telangana, Telugu Statews

భారతదేశంలో రోజురోజుకి కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నేడు ఒక్కరోజే అత్యధికంగా దేశం మొత్తంగా కొత్తగా 20 వేల కేసులు నమోదయ్యాయి.

 No Rtc Buses Telugu States

అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కరోనా విజృంభిస్తున్న సంగతి అందరికీ విదితమే.అయితే ఈ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు కరోనా వైరస్ బ్రేక్ వేస్తోంది.

అసలు విషయంలోకి వెళ్తే.ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు ప్రారంభించడానికి అవసరమైన ఒప్పందం ఇప్పటికే ఒక దశకు చేరుకున్నప్పటికి, రోజురోజుకి తెలుగు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో చర్చలు ముగియకుండా నిలిచిపోయాయి.

ఆర్టీసీ ఒప్పందానికి కరోనా బ్రేక్ …-General-Telugu-Telugu Tollywood Photo Image

దీనికి కారణం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బస్ భవన్ లో ఆపరేషన్ వివరాలు చూసే విభాగంలోని ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడమే.

ఇక ఈ నేపథ్యంలో గత బుధవారం చర్చలు జరగాల్సి ఉండగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చర్చలు వాయిదా పడ్డాయి.

ఈ విషయంపై తెలంగాణ రాష్ట్రలకు సంబంధించిన ఆర్టీసీ ఉన్నత అధికారి త్వరలో ఇరు రాష్ట్రాల మధ్య చర్చలకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తామని తెలియజేశారు.ఏదేమైనా ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల మధ్య పూర్తిగా బస్సు లు తిరిగే సదుపాయం లేనట్టే మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

No Rtc Buses Telugu States Related Telugu News,Photos/Pics,Images..

footer-test