వారికేమి పట్టదా ? 'హ్యాండ్' ఇచ్చారన్న బాధలేదా ?  

No Response From Congress Leaders-clp,congress,hand,kcr,revanth Reddy,trs,ఇంటర్మీడియట్ బోర్డు,రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు అధిష్టానానికి కాదు ఎవరికీ అర్థంకావడంలేదు. కొంతమంది పార్టీ నాయకుల తీరు విగ్రహం పుష్టి . నైవేద్యం నష్టి అన్నట్టుగా చెప్పుకోవడానికి సీనియర్ నాయకులు తప్ప వారి వల్ల పెద్దగా పార్టీకి ఒరిగిందేమి లేదన్నట్టుగా పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్టీ నుంచి ఎంతమంది వెళ్లిపోతున్నా తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఎవరికీ మింగుడుపడడంలేదు. తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లిపోతున్నా అదేదో తమ బాధ్యత కాదన్నట్టుగా కొంతమంది కాంగ్రెస్ నాయకుల తీరు ఉండడం ఆ పార్టీలో అయోమయాన్ని తెలియజేస్తోంది..

వారికేమి పట్టదా ? 'హ్యాండ్' ఇచ్చారన్న బాధలేదా ? -No Response From Congress Leaders

ఒకరో ఇద్దరో నేతల తప్ప. పార్టీ కోసం గట్టిగా కష్టపడదామన్న ఆలోచన ఉన్న నాయకులు ఎవరూ కనిపించడంలేదు.

తెలంగాణాలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ఆలోచనతో సీఎల్పీ విలీనానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.

దాన్ని అడ్డుకోవడం కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు క్షేత్రస్థాయిలో మంచి స్పందనే వస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎక్కడిక్కడ కార్యకర్తలు నిలదిస్తూ, రాజీనామా చేయాల్సిందే అంటూ పట్టుపడుతూ హడావుడి చేస్తున్నారు.

కాకపోతే ఈ యాత్రలో భట్టికి తోడుగా ఇతర కాంగ్రెస్ నాయకులెవ్వరూ కలిసి రావడం లేదు. ఈ యాత్రలో పాలుపంచుకోవాల్సిందిగా సమాచారం అందుతున్నా తమను కాదు అన్నట్టుగా పార్టీలో మిగతా కీలక వ్యవహరిస్తున్నారు.

‘భట్టి’ ఈ యాత్ర ప్రారంభించిన రోజున కూడా పార్టీ ప్రముఖ నాయకులు ఎవరూ హాజరు కాలేదు. దీంతో చేసేది ఏమీ లేక ఆయనే సొంతంగా యాత్రను నెట్టుకొచ్చిన పరిస్థితి. దాదాపుగా ఇదే పరిస్థితిని వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఎదురయ్యింది. తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపింది.

అయితే దీన్ని అవకాశంగా మలుచుకుందామని రేవంత్ గట్టిగా కృషి చేసినా మిగతా నాయకులు ఎవరూ ముందుకు రాలేదు. అయినా గాంధీభవన్ దగ్గర రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ సిద్ధమయ్యారు. ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కూడా యథావిధిగా హాజరుకాలేదు..

దీంతో ఒకటిన్నర రోజుకే ఈ దీక్షను రేవంత్ విరమించేసాడు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే మిగతా కాంగ్రెస్ నాయకులు ఎవరికీ దీనిపై ఇంట్రెస్ట్ లేదా అనే సందేహం కలుగుతోంది.