ఎన్టీఆర్ టీజర్‌లో ఆ అంశం ఉండదా?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను బాహుబలి సృష్టికర్త రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో యావత్ సినిమా ప్రేమికులు ఆర్ఆర్ఆర్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 No Ram Charan Voiceover For Ntr Teaser Rrr, Rrr, Ram Charan, Ntr, Alluri Seethar-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ చూస్తున్నారు.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

కాగా చరణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.అయితే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో తారక్ చేస్తున్న కొమురం భీం పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది.దీంతో ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే రామరాజు పాత్రకు సంబంధించిన టీజర్‌లో భీం వాయిస్ ఓవర్ మనకు వినిపించింది.చరణ్ పాత్రను తారక్ ఎలివేట్ చేసిన విధానంతో మనందరికీ గుస్‌బంప్స్ వచ్చాయి.

కాగా ఇప్పుడు తారక్ పోషిస్తున్న కొమురం భీం పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ క్రమంలో కొమురం భీం పాత్రకు చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందా లేదా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఏదేమైనా ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ఈ టీజర్ కోసం కూడా అంతే రేంజ్‌లో ఎదురుచూస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.వచ్చే ఏడాదిలో ఈ సినిమాను అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube