కోవిషీల్డ్ రగడ: భారత్ దెబ్బకు దిగొచ్చిన యూకే సర్కార్... ఇకపై క్వారంటైన్ అక్కర్లేదు, కొత్త రూల్స్

కోవిషీల్డ్ టీకాను వేసుకున్న భారతీయులను.వ్యాక్సిన్ వేసుకోని వారిగానే పరిగణించి క్వారంటైన్‌లో వుండాల్సిందేనంటూ బ్రిటన్ ప్రభుత్వం చేసిన రాద్ధాంతం అంతా కాదు.

 No Quarantine In Uk For Indians Fully Vaccinated With Covishield British Envoy ,-TeluguStop.com

కానీ భారత్ కూడా అంతే తీవ్రంగా ప్రతిస్పందించడంతో యూకేకు దిమ్మతిరిగింది.దీనిలో భాగంగానే కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నా సరే భారత్‌ నుంచి బ్రిటన్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన నుంచి యూకే వెనక్కు తగ్గింది.

వ్యాక్సిన్‌ అర్హత ఉన్న దేశాల జాబితాలోకి ఇండియాను చేర్చింది.కొత్త మార్గదర్శకాల ప్రకారం.

అక్టోబర్‌ 11 నుంచి బ్రిటన్‌కు వచ్చే భారత ప్రయాణికులు కోవిషీల్డ్ లేదా బ్రిటన్‌ అనుమతించిన ఏదైనా టీకా రెండు డోసులు తీసుకున్నట్లైతే అలాంటి వారికి క్వారంటైన్‌ తప్పనిసరి కాదని తెలిపింది.

ఈ మేరకు అక్టోబర్ 11వ తేదీ నుంచి యూకే రెడ్ లిస్ట్‌ను 7 దేశాలకు కుదించనున్నారు.

ఇందులో ఇండియా సహా మొత్తం 37 కొత్త దేశాలు, భూభాగాలను బ్రిటన్ తన రెడ్ లిస్ట్ జాబితా నుంచి మినహాయించింది.కొలంబియా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, హైతీ, పనామా, పెరూ, వెనిజులా సహా 7 దేశాలు మాత్రమే తాజాగా బ్రిటన్ రెడ్ లిస్ట్‌లో ఉన్నాయి.

భారత టీకా సర్టిఫికేట్‌ను యూకే.అక్టోబర్‌ 11 నుంచి గుర్తిస్తుందని, రెండు దేశాల మంత్రిత్వశాఖల చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్‌ అలెక్స్‌ వెల్లడించారు.

ఈ అంశంపై గత నెలరోజులుగా అండగా నిలిచినందుకు భారత ప్రభుత్వానికి అలెక్స్ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, భారత్‌లో కోవిషీల్డ్ వేసుకున్న వారిని తమ దేశంలో టీకాలు వేసుకోని వారిగానే పరిగణిస్తామని బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించడంపై భారత్ అగ్గిమీద గుగ్గిలమైన సంగతి తెలిసిందే.

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ 10 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి అంటూ అక్కడి అధికారులు పెట్టిన నిబంధనలు వివాదాస్పదమయ్యాయి.వాటిని తీవ్రంగా ఖండిస్తోన్న భారత్‌.

ఈ నిర్ణయం ఖచ్చితంగా వివక్షేనని ఎద్దేవా చేసింది.అయితే ఈ చర్యపై దెబ్బకు దెబ్బ తీయాలని భారత్ డిసైడ్ అయ్యింది.

Telugu British, British Alex, Colombia, Ecuador, Haiti, Quarantineuk, Panama, Pe

దీనిలో భాగంగా బ్రిటన్ నుంచి వచ్చే పౌరులపై ఆంక్షల కొరడా ఝుళిపించింది.భారత్‌లో అడుగుపెట్టిన బ్రిటన్‌ పౌరులను 10 రోజులు క్వారంటైన్‌లో ఉంచడంతోపాటు 3 సార్లు కొవిడ్‌ టెస్టులు వంటి ఆంక్షలు అమలు చేయనుంది.దీని ప్రకారం అక్టోబర్‌ 4వ తేదీ నుంచి భారత్‌కు వచ్చే బ్రిటన్‌ పౌరులు 3 ఆర్‌టీ పీసీఆర్‌ రిపోర్టులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.ప్రయాణానికి 72 గంటల ముందు ఒకసారి, ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత మరోసారి, 8వ రోజు ఇలా మొత్తంగా మూడుసార్లు కొవిడ్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది.

భారత్‌కు చేరుకున్న తర్వాత ఇంటివద్ద/ హోటల్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి.వ్యాక్సిన్‌ తీసుకున్నారా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా బ్రిటన్‌ పౌరులు ఈ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.అయితే భారత్ ఈ స్థాయిలో స్పందిస్తుందని ఊహించని యూకే.ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube