వకీల్ సాబ్‌ను ఎందుకు లైట్ తీసుకుంటున్నారో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

 No Proper Promotions For Vakeel Saab, Vakeel Saab, Pawan Kalyan, Nivetha Thomas,-TeluguStop.com

దాదాపు రెండేళ్ల తరువాత పవన్ బిగ్ స్క్రీన్‌పై కనిపించనుండటంతో పవన్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 9న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాకు ప్రమోషన్స్ మాత్రం అనుకున్న స్థాయిలో జరగడం లేదని చిత్ర వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.పవన్ లాంటి క్రేజీ స్టార్ హీరో చిత్రానికి ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో ఉండాలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

కానీ వకీల్ సాబ్ చిత్ర ప్రమోషన్స్ మాత్రం అంతంతమాత్రంగా ఉండటంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.పవన్ రెండేళ్ల తరువాత కమ్‌బ్యా్క్ ఇస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మరింత హైప్ తీసుకురావాలని వారు కోరుతున్నారు.

ఎంతటి స్టార్ హీరో చిత్రం అయినా సరైన ప్రమోషన్స్ లేకపోతే బాక్సాఫీస్ వద్ద సినిమాకు అనుకున్న స్థాయిలో రిజల్ట్ రాదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్యాలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక కేమియో రోల్‌లో అందాల భామ శృతి హాసన్ నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను త్వరలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మరి ఇకనైనా వకీల్ సాబ్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహించాలని పవన్ అభిమానులు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube