తెలంగాణలో ముందస్తు ఎన్నికల వచ్చే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా రాజకీయ విశ్లేషణకులు అంచనా వేస్తున్నారు… ఒకపక్క కవితకు ఈడి నోటీసులు, విచారణ ,మరొకపక్క కేసీఆర్ క్యాబినెట్ భేటీ మరియు పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం ఏదో సంచలన నిర్ణయం దిశగా ముందుకు వెళుతుందనే అనుమానాలు రేగాయి.విచారణ తర్వాత ఈడి ఖచ్చితంగా కవితను అరెస్టు చేసే అవకాశం ఉందని ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని .
కేంద్రం చేస్తున్న వేధింపులను ప్రజల్లో బాగా ప్రచారం .చేయాలని తద్వారా ప్రభుత్వంపై సానుభూతిని పెంచుకొని తొందరగా ప్రభుత్వ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని బారాస ప్లాన్ చేసిందని ,ఇలా రకరకాల అంచనాలు రాజకీయ విశ్లేషణకుల నుంచి వెలుపడ్డాయి.

అయితే అనుకున్నది చేస్తే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతాడు.అంచనాలన్నిటిని ఒక మాటతో పటా పంచలు చేశారు.రాష్ట్రంలో ముందస్తు ముచ్చట లేదని కుండబద్దలు కొట్టేశారు.షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లోనే ఎలక్షన్లు జరుగుతాయనిఅవుతాయని దానికి తగినట్లుగా ప్రిపేర్ అవ్వడంటూ నాయకులతో జరిగిన సమావేశంలో క్లారిటీ ఇచ్చేశారు.
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో ప్రచారం చేయాలని ప్రతిపక్షాల విమర్శలను ఎక్కడకక్కడ ఎండగట్టాలని ఆయన సూచించారు .ఇకపై పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని, ఎప్పటికప్పుడు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేపట్టాలని, అవసరమైతే పాదయాత్రలు కూడా ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన భారాశా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభను వరంగల్ వేదికగా భారీ స్థాయిలో నిర్వహించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఏది ఏమైనా కేంద్రంతో ఉన్న విభేదాల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం అంత శ్రేయస్కరం కాదని, ఒక పక్కా వివాహం ప్రకారం ముందుకు వెళ్లాలని బారా అదినాయకత్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది దానికి అనుగుణంగానే ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు చెక్ పెట్టినట్లుగా అర్థమవుతుంది
.