తమ కొత్త ప్రైవసీ పాలసీని ఎట్టి పరిస్థితిలో వాయిదా వేయలేమంటున్న వాట్సాప్..!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీనీ ప్రతి ఒక్కరు కూడా బాగా వినియోగిస్తున్న సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం, సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.

 No Postponement In Whats App Privacy Policy Clarifies To Delhi High Court, Whats-TeluguStop.com

ఈ క్రమంలో అనేకమంది ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను అనేక పనుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు.ఇటీవల వాట్సాప్ కస్టమర్ల కోసం కొత్త ప్రైవసీ పాలసీని ప్రవేశపెట్టి, దాని అంగీకారానికి మే 15 వరకు అనుమతి ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.

అయితే తాజాగా మే 15 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త ప్రైవసీ పాలసీని ఎట్టి పరిస్థితిలో వాయిదా వేయలేమని ఢిల్లీ హైకోర్టుకు తెలియచేసింది.ఎవరైనా సరే వాట్సాప్ యూజర్లు కొత్త ప్రైవసీ పాలసీ విధానాన్ని అంగిగారించకపోతే దశల వారిగా వారి ఖాతాలను నిలిపివేస్తమని వాట్సాప్ సంస్థ తెలిపింది.

ఈ క్రమంలో సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు.ఈ వాదనలలో “మా గోప్యతా విధానం ఐటి నిబంధనలను అతిక్రమించలేదు అని చాలా స్పష్టమైన ప్రకటన చేశాం, మేము అన్నీ నిబందనల ప్రకారం వెళ్తున్నాం” అని సివిల్ కోర్టుకు తెలపగా, ఈ విధానాన్ని అంగీకరించని వాట్సాప్ కస్టమర్లు యాప్‌ ను వాడేందుకు అనుమతించట్లేదంటూ వినిపించిన వాదనల్లో వాట్సాప్ తీవ్రంగా ఖండించింది.

కేంద్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్‌ శర్మ ఈ సరికొత్త ప్రైవసీ పాలసీ విధానం టెక్నాలజీ యాక్ట్(2000) లోని కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తుందనే పలు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.ఈ క్రమంలో వీటిపై కేంద్రం వాట్సాప్ ఉన్నత అధికారులకు లేఖ రాసినట్లు, వారి నుంచి సమాధానం కోసం వేచి ఉన్నట్లు తెలియజేశారు.

ఇలా ఉండగా గతంలో మే 15 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త ప్రైవసీ విధానం పై న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ వైఖరిని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు దాఖలు చేసిన సంగతి అందరికీ విధితమే.ఇది ఇలా ఉండగా మరోవైపు వాట్సాప్ యథాతథ స్థితిని కొనసాగించాలని చేతన్ శర్మ పిటీషన్ లో కోరినట్లు సమాచారం.

దీనితో ఈ విచారణను ఢిల్లీ హైకోర్టు జూన్ 3 కు వాయిదా వేసినట్లు కనపడుతుంది.ఇక ఈ ప్రైవేట్ పాలసీ విషయంపై కాస్త స్పష్టత రావాలంటే జూన్ 3 వరకు వాట్సాప్ యూజర్లు వేచి ఉండాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube