దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ మల్టీ్స్టారర్ మూవీపై తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తు్న్నాడు.
ఇప్పటికే ఈ సినిమా టైటిల్, చరణ్ ఫస్ట్ లుక్‌లను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్లతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలు ఉండటంతో ఈ సినిమా షూటింగ పనులు వాయిదా పడ్డాయి.
దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా లేక మరోసారి వాయిదా వేస్తారా అనే ప్రశ్న సర్వత్రా ఏర్పడింది.ఇప్పటికే ఈ సినిమాను జూలై 30, 2020 నుండి జనవరి 8, 2021కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా మెజారిటీ శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని, ఇకపై రిలీజ్ వాయిదా వేసే ప్రసక్తే లేదని చిత్ర నిర్మాత డివివి దానయ్య తెలిపారు.ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జనవరి 8న రిలీజ్ చేసి తీరుతామని ఆయన తేల్చేశారు.
రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తుండగా అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.