ఎన్నారైలకు కేంద్రం షాక్..ఇక ఆ అవకాశం లేనట్టే...??

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులకు కేంద్రం షాక్ ఇచ్చింది.భారత్ లో వివిధ రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కుని కల్పిస్తుందని భావించిన ఎన్నారైల ఆశలపై కేంద్రం నీళ్ళు చల్లింది.

 No Postal Ballots For Nris In Upcoming State Elections,  State Elections, Nri, E-TeluguStop.com

ఈ ప్రణాళిపై ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తాజాగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అరోరా ప్రకటన ద్వారా అర్ధంయ్యిందని అంటున్నారు నిపుణులు.దాంతో రాబోయే పశ్చిమ బెంగాల్, కేరళా, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్నారైలు నేరుగా వెళ్లి ఓటు వేయాలే తప్ప పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదని తెలుస్తోంది.

ఎన్నారైలకు ఓటు హక్కుని కలిపించే విధంగా పోస్టల్ బ్యాలెట్ విధానంపై చర్చలు జరపాలని ఎలక్షన్ కమిషన్ ను కేంద్రం సూచించింది.దాంతో ఎలక్షన్ కమిషన్ దాదాపు నెల రోజుల క్రితమే భారత న్యాయమంత్రిత్వ శాఖకు ఓ ప్రపోజల్ సిద్దం చేసి పంపగా ఆ ప్రపోజల్ ను న్యాయశాఖ విదేశాంగ మత్రిత్వ శాఖకు పంపింది.

ఈ విషయంపై మాట్లాడిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ అరోరా విదేశాంగ కార్యదర్శి ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని అయితే ఈ విధానం అమలు చేసే ముందు ఈటీపీబీఎస్ (ఎలక్ట్రానిక్ ట్రాన్సిమిటేడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్) వారితో కలిసి కొంత చర్చలు జరగాలని పేర్కొన్నారని తెలిపారు.అయితే

ఈ సమావేశం జరగడానికి నెలరోజులు అంతకంటే ఎక్కువ రోజులు పట్టవచ్చని కూడా తెలిపారు.

ఐదు రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల షెడ్యూల్ లు ప్రకటిస్తున్న సమయంలోనే ఈ ఎన్నారై పోస్టల్ బ్యాలెట్ పై ప్రకటన చేయడంతో ఈ సారి కూడా ఎన్నారైలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం లేదని అర్ధంయ్యిందని, ఈ విధానం అమలు కావాలంటే మరింత కాలం వేచి చూడక తప్పదని అంటున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube