ఆ ట్రైన్‌ ఎక్కగానే పాయింట్‌ విప్పాల్సిందే.. మగవారు మాత్రమే కాదు, ఆడవారు కూడా.. ఆ అండర్‌ గ్రౌండ్‌ రైల్‌ ప్రత్యేకత ఇది

ప్రతి రోజు ఒకే తరహాలో ప్రయాణించి బోర్‌ కొట్టిన అక్కడి వారు సంవత్సరంలో ఒక్క రోజు కాస్త విభిన్నంగా ప్రయాణించాలని భావించారు.అనుకున్నదే తడువుగా కొందరు కలిసి మాట్లాడుకుని ఆ ట్రైన్‌లో ప్రయాణించే వారందరిని ఒప్పించి ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు.

 No Pants Day Subway Ride-TeluguStop.com

సంవత్సరంలో ఒక రోజు ఆ ట్రైన్‌లో ప్రయాణించే వారు పాయింట్‌ విప్పి ప్రయాణించాలి.ప్రత్యేకంగా ఒక రోజును నిర్ణయించడంతో పాటు అందరితో కూడా ఈ సరదా పనిని చేయిస్తున్నారు.అమెరికాతో పాటు బ్రిటన్‌ ల్లో ఈ నో పాయింట్‌ రైడ్‌ కొనసాగుతుంది.

2002వ సంవత్సరంలో అమెరికాలోని న్యూ యార్క్‌లో ఇది మొదలైంది.ఒక సబ్‌ వే ట్రైన్‌ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రెగ్యులర్‌కు భిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైలు సబ్‌ వేలోకి ప్రవేశించిన వెంటనే పాయింట్స్‌ను విపేశారు.వారిని చూసి మరి కొందరు పాయింట్స్‌ విప్పడం మొదలు పెట్టారు.

అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం మే 3న సబ్‌ వే నో పాయింట్‌ జర్నీని అక్కడి వారు జరుపుకుంటున్నారు.ఇదేదో గొప్ప పనిగా తాము చెప్పడం లేదు.

ఇది ఏ ఒక్క కార్యక్రమాన్ని ప్రమోట్‌ చేయడానికో లేదంటే మోటివేట్‌ చేయడానికో కాదు.ప్రతి రోజు రెగ్యులర్‌ గా పని చేస్తూ, ప్రయాణాలు చేస్తున్న వార్తు కాస్త రిలాక్స్‌ అయ్యేందుకు ఇలాంటి ప్రయాణం ఏర్పాటు చేశామని నిర్వాహకులు అంటున్నారు.

ప్రతి రోజు పాయింట్‌ వేసుకుని ప్రయాణిస్తున్నాం.సంవత్సరంలో ఒక్క రోజు అందరితో పాటు సరదాగా పాయింట్‌ విప్పడంలో నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు.పైగా ఇది సరదాగా కూడా అనిపిస్తుందని ఒక అమ్మాయి చెప్పుకొచ్చింది.అమ్మాయిలు, అబ్బాయిలు అంతా కూడా పాయింట్స్‌ విప్పి జర్నీ చేస్తూ ఉండటం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అక్కడి వారు అంటున్నారు.

అమెరికాలో మే 3న ఈ నోపాయింట్‌ జర్నీ ఉంటే, బ్రిటన్‌లో మాత్రం జనవరి 13న నో పాయింట్‌ జర్నీ సాగిస్తారు.మొన్ననే బ్రిటన్‌లో ఈ జర్నీ జరిగింది.

ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌లలో కలిపి మొత్తం 100 నగరాల్లో ఈ నో పాయింట్‌ జర్నీ సాగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube