కేసీఆర్ మాటను ఎవరూ పట్టించుకోవడంలేదా ?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలుకంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలలు నిజమయ్యే ఛాన్స్ కనిపించడంలేదు.ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలు అన్నిటిని ఏకం చేసి కేంద్రంలో అధికారం దక్కించుకునేందుకు కేసీఆర్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు.

 No One Interested In Kcrs Federal Front-TeluguStop.com

అయితే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బలం పుంజుకోవడంతో ప్రాంతీయ పార్టీలన్నీ ఆలోచనలో పడ్డాయి.ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీల ప్రభుత్వం కానీ లేదా ఏదో ఓ జాతీయపార్టీ మద్దతిచ్చిన ప్రభుత్వం కానీ ఏర్పడటం తప్ప మరో మార్గం లేదు.

ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ అనధికారికంగా కూటమిగా ఉన్నాయి.కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్‌కు వచ్చే సీట్లను బట్టి కాంగ్రెస్‌కు మద్దతివ్వాలా, కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలా అన్నదానిపై కూటమి పరిణామాలు ఆధారపడి ఉంటాయి

కేసీఆర్ ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్ మీద పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడంలేదు.

ఇప్పటికిప్పుడు ఎవరూ కేసీఆర్ కొత్తకూటమి పెడతారని.అందులో చేరి కీలక పాత్ర పోషించాలనే ఆలోచన ఎవరూ చేయడం లేదు.

ఏపీ నుంచి ఒక్క జగన్ మాత్రమే సానుకూలంగా ఉన్నారు.ఈ కారణాలతో.

ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదు కాబట్టి ఫలితాల తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా కేంద్రంలో ఏదో ఒక జాతీయ పార్టీకి మద్దతు ఇస్తేనే బెటర్ అన్న ఆలోచనలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.కర్ణాటక సీఎం కుమారస్వామితో కాంగ్రెస్‌ కూటమిలో చేరేందుకు రాయబారం నడుపుతున్నారని జాతీయ మీడియా చెబుతోంది

ప్రస్తుతం టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.ఎంపీ వినోద్ కుమార్ కూడా ఆ కోణంలోనే చర్చలు జరుపుతున్నారు.ఈ సారి యునైటెడ్ ఫ్రంట్ తరహా ప్రభుత్వం ఏర్పడుతుందని.

కాంగ్రెస్ పార్టీల కూటమికి తప్పనిసరిగా మద్దతివ్వాల్సిన పరిస్థితి ఉందని ఆయన అంచనా వేశారు.వినోద్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు తరువాత టీఆర్ఎస్ నేత మంతనాలు కూడా ప్రారంభించారని చెప్పుకోవడం ప్రారంభించారు.

కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు కేసీఆర్ చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంతో బీజేపీ వర్గాలు కూడా గుర్రుగా ఉంది.ఇటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో కానీ, కాంగ్రెస్ పార్టీ అనుకూల ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరడం కానీ అంత సులువు కాదు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube