తిరుమల మొత్తం ఖాళీ ఖాళీ  

No One In Tirumala Venkateswara Hills-lord Venkateswarla Swamy,quew Complex,tirumala,ttd

తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే అతి పెద్ద పుణ్య క్షేత్రాల్లో ఒకటి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రతి రోజు కూడా లక్షల మంది భక్తులు దైవ దర్శనంకు వస్తూ ఉంటారు.

No One In Tirumala Venkateswara Hills-Lord Venkateswarla Swamy Quew Complex Tirumala Ttd

ఇక సెలవు రోజుల్లో ఆ సంఖ్య డబుల్‌ త్రిబుల్‌ అయినా కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు.ఎప్పుడు జనాలతో కళకళలాడుతూ ఉండే తిరుమల కొండలు నిన్న నేడు వెల వెల పోతున్నాయి.

జనాలు చాలా తక్కువగా ఉండటంతో కొండలు అంతా కూడా ఖాళీ ఖాళీగా ఉన్నాయంటూ స్థానికులు చెబుతున్నారు.

సాదారణంగా ఫ్రీ దర్శణంకు మూడు నాలుగు గంటల సమయం పడుతుంది.

రద్దీ ఉన్న సమయంలో ఒక రోజంతా కూడా పట్టే అవకాశం ఉంటుంది.కాని నిన్న మరియు నేడు కేవలం రెండు గంటల్లోనే దర్శనం పూర్తి అవుతుంది.

ప్రస్తుతానికి తిరుమల వైకుంఠ కాంప్లెక్సుల్లో జనాలు అస్సలు లేరు.ఒకటి రెండు క్యూ కాంప్లెక్సులు నిండే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

గతంలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ మందిని చూడలేదు అంటున్నారు.నిన్న మొత్తం 70 వేల మంది మాత్రమే స్వామి వారిని దర్శించుకున్నారట.

ఇక నేడు కూడా అదే స్థాయిలో స్వామి వారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది.సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత అంతా బిజీ అయ్యి దేవుడి దర్శనంకు మళ్లీ వీకెండ్‌ కోసం ఎదురు చూస్తున్నారని, అందుకే వెల వెల అంటున్నారు.

తాజా వార్తలు